AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : టీమిండియాకు షాక్.. సిడ్నీ వన్డేలో గాయం పాలైన శ్రేయస్ అయ్యర్ క్రికెట్‎కు దూరం

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలుపు సంబరాలు చేసుకుంటున్న వేళ, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‎కు మాత్రం ఒక చేదు వార్త ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన అయ్యర్, గాయపడటంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

Shreyas Iyer : టీమిండియాకు షాక్.. సిడ్నీ వన్డేలో గాయం పాలైన శ్రేయస్ అయ్యర్ క్రికెట్‎కు దూరం
Shreyas Iyer
Rakesh
|

Updated on: Oct 26, 2025 | 6:49 AM

Share

Shreyas Iyer : ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలుపు సంబరాలు చేసుకుంటున్న వేళ, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‎కు మాత్రం ఒక చేదు వార్త ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన అయ్యర్, గాయపడటంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. పక్కటెముకలకు గాయం కావడంతో శ్రేయస్ అయ్యర్ కొన్ని వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో తను ఆడడం పై సందేహాలు నెలకొన్నాయి.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా, 34వ ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడానికి శ్రేయస్ అయ్యర్ ప్రయత్నించాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న అయ్యర్ వెనక్కి పరుగెత్తి, డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. అయితే, బంతిని పట్టుకున్న తర్వాత మైదానంలో పడగానే నొప్పిగా అరిచాడు. తన కడుపు, ఛాతీ భాగాన్ని గట్టిగా పట్టుకుని బాధపడ్డాడు. దీంతో మెడికల్ టీమ్ అతన్ని వెంటనే మైదానం నుంచి బయటకు తీసుకెళ్లింది.

గాయం తీవ్రతను తెలుసుకోవడానికి బీసీసీఐ అయ్యర్‌ను వెంటనే ఆసుపత్రికి పంపించింది. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం..అయ్యర్‌కు ఎడమ వైపు పక్కటెముకలకు గాయం తగిలినట్లు తేలింది. బీసీసీఐకి చెందిన వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పరీక్షల్లో పక్కటెముకలకు పెద్ద దెబ్బ తగిలినట్లు కనిపిస్తోందని, దీని కారణంగా అతను కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం.

భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, శ్రేయస్ అయ్యర్ తదుపరి వైద్య పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎కు వెళ్లనున్నాడు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. అయ్యర్ కనీసం 3 వారాల పాటు క్రికెట్‎కు పూర్తిగా దూరంగా ఉంటాడు. దీంతో నవంబర్ 30న రాంచీలో ప్రారంభం కానున్న సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ వర్గాలు, అయ్యర్ పక్కటెముకలకు హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ గనుక అయితే, అతను కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాబట్టి సౌతాఫ్రికా సిరీస్‌లో అతను ఆడటం దాదాపుగా అసాధ్యమే.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి