AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్, ఆసీస్ టీ20ఐ సిరీస్‌కు లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాక్సీ డ్రైవర్ కొడుకు.. 2 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. ఎవరంటే?

India vs Australia: ఆస్ట్రేలియా జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ అందుబాటులో లేకపోవడంతో ఈ అవకాశం వచ్చింది. ఆడమ్ జంపా స్థానంలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీ20 జట్టులో చేరిన ఓ భారత సంతతి ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్, ఆసీస్ టీ20ఐ సిరీస్‌కు లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాక్సీ డ్రైవర్ కొడుకు.. 2 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. ఎవరంటే?
Tanveer Sangha
Venkata Chari
|

Updated on: Oct 27, 2025 | 5:31 PM

Share

India vs Australia: ఇండియా-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కోసం జట్టులో టాక్సీ డ్రైవర్ కొడుకును చేర్చారు. ఈ ఆటగాడు రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ అందుబాటులో లేకపోవడంతో ఈ అవకాశం వచ్చింది. ఆడమ్ జంపా స్థానంలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీ20 జట్టులో చేరిన ఆస్ట్రేలియా క్రికెటర్ తన్వీర్ సంఘ గురించి మనం మాట్లాడుతున్నాం.

రెండేళ్ల తర్వాత జట్టులోకి తన్వీర్ సంఘ..

తన్వీర్ సంఘ రెండేళ్ల క్రితం డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియా తరపున తన చివరి టీ20ఐ ఆడాడు. విశేషమేమిటంటే అతని చివరి ఐ20ఐ కూడా బెంగళూరులో భారత్‌పైనే జరిగింది. ఇప్పుడు, రెండేళ్ల తర్వాత, అతను తిరిగి ఆటలోకి వచ్చాడు.

ఆగస్టు 2023లో టీ20 అరంగేట్రం చేసిన తన్వీర్ సంఘ, పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. అతను ఒకసారి నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శన. దక్షిణాఫ్రికాపై జరిగిన తన అరంగేట్రంలోనే అతను ఈ ఘనతను సాధించాడు.

ఇవి కూడా చదవండి

ఆడమ్ జంపా ఎందుకు ఔట్ అయ్యాడు?

భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో, ఆడమ్ జంపా స్థానంలో తన్వీర్ సంఘను ఎంపిక చేశారు. అతను తన రెండవ బిడ్డ జన్మించిన కారణంగా సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడు. ఆడమ్ జంపా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. కాబట్టి తన్వీర్ సంఘ తన స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సిన ఒత్తిడిలో ఉంటాడు.

తండ్రి సిడ్నీలో టాక్సీ డ్రైవర్..

తన్వీర్ సంఘ భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా ఆటగాడు. అతని తండ్రి జోగా సంఘ సిడ్నీలో టాక్సీ నడుపుతాడు. అతను 1997లో పంజాబ్‌లోని జలంధర్ నుంచి సిడ్నీకి చదువుల కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ది ట్రిబ్యూన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జోగా సంఘ తన కుటుంబంలో ఎవరికీ క్రికెట్ పట్ల ఆసక్తి లేదని, కబడ్డీ, వాలీబాల్‌ను ఇష్టపడతారని వివరించాడు. అయితే, తన్వీర్ క్రికెట్‌ను ఎంచుకోవడంతో, ఇప్పుడు కుటుంబంలో ఒక క్రికెటర్ ఉన్నాడన్నమాట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
నటి వేధింపుల కేసులో A8 దిలీప్‌పై కేసు కొట్టివేత
నటి వేధింపుల కేసులో A8 దిలీప్‌పై కేసు కొట్టివేత