GT vs KKR, IPL 2024: భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే..
Gujarat Titans vs Kolkata Knight Riders : షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. వర్షం ఆగుతుందని చాలాసేపు ఎదురుచూశారు. కానీ ఎంతకూ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
Gujarat Titans vs Kolkata Knight Riders : ఐపీఎల్ 17వ సీజన్ 63వ మ్యాచ్ లో భాగంగా సోమవారం ( మే 13) గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా రద్దైంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. వర్షం ఆగుతుందని చాలాసేపు ఎదురుచూశారు. కానీ ఎంతకూ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మ్యాచ్ రద్దుతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ఇంటి బాట పట్టింది. గుజరాత్ టైటాన్స్‌కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. టోర్నీలో తమ సవాల్‌ను నిలబెట్టుకోవాలంటే గుజరాత్‌కు కోల్‌కతాపై గెలవాల్సిన అవసరం ఉంది. అయితే మ్యాచ్‌కు ముందే నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షం బ్యాటింగ్ గుజరాత్‌పై సాగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు నీలేజా మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో ఇరు జట్లకు, ఎన్నో ఆశలతో మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది.
మరోవైపు వరుస విజయాలతో KKR ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో కేకేఆర్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కాబట్టి గుజరాత్‌పై గెలిచి టాప్ 2లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కోల్ కతా భావించింది. కానీ ఆ జట్టు ఆశలపై కూడా వర్షం నీళ్లు చల్లింది.
🚨 Update 🚨
The covers are still on in Ahmedabad causing a delay in the toss 😞
Stay tuned for further updates
Follow the Match ▶️ https://t.co/8kHW1lKneo#TATAIPL | #GTvKKR pic.twitter.com/oXiMOc5g03
— IndianPremierLeague (@IPL) May 13, 2024
గుజరాత్ టైటాన్స్ జట్టు:
శుభమాన్ గిల్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సంధర్సన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి, కార్తీక్ త్యాగి , అభినవ్ మనోహర్, శరత్ BR, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మానవ్ సుతార్, విజయ్ శంకర్ మరియు సుశాంత్ మిశ్రా.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అనుకుల్ రోరా, సుయాష్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, దుష్మంత చమీరా, శ్రీకర్ భరత్, చేతన్ సకారియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సాకిబ్ హుస్సేన్ మరియు అల్లా గజన్‌ఫర్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..