Vijay HazareTrophy : 7 వికెట్లంటే సామాన్యమా సామీ..అందుకే సీఎస్కే రిటైన్ చేసుకుంది..ధోనీ టీమ్‌లో మరో వజ్రం
Ramakrishna Ghosh : జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. కేవలం 9.4 ఓవర్లు వేసి, 42 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మహారాష్ట్ర తరపున విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రామకృష్ణ రికార్డు సృష్టించాడు.

Vijay HazareTrophy : ఐపీఎల్ 2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోయినా, మహారాష్ట్ర ఆల్ రౌండర్ రామకృష్ణ ఘోష్ పై నమ్మకంతో అతడిని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రామకృష్ణ దేశవాళీ క్రికెట్‌లో నిప్పులు చెరుగుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. కేవలం 9.4 ఓవర్లు వేసి, 42 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మహారాష్ట్ర తరపున విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రామకృష్ణ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2014లో డొమినిక్ ముత్తుస్వామి పేరిట ఉన్న (6 వికెట్లు) రికార్డును ఇతడు చెరిపివేశాడు. అతని స్పెల్ ధాటికి హిమాచల్ ప్రదేశ్ జట్టు 270 పరుగులకే కుప్పకూలింది.
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 7 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితా చాలా చిన్నది. రామకృష్ణ ఘోష్ ఈ ఘనత సాధించిన కేవలం 12వ బౌలర్‌గా నిలిచాడు. షాబాజ్ నదీమ్, అర్పిత్ గులేరియా (8 వికెట్లు) ఈ జాబితాలో ముందుండగా, ఇప్పుడు రామకృష్ణ పేరు కూడా ఆ దిగ్గజాల సరసన చేరింది. హిమాచల్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే టాప్-4 బ్యాటర్లను పెవిలియన్ పంపి ఆ జట్టు వెన్నుముక విరిచాడు.
రామకృష్ణ కేవలం బౌలర్ మాత్రమే కాదు, పక్కా ఆల్ రౌండర్ అని నిరూపించుకుంటున్నాడు. ఇదే టోర్నీలో పంజాబ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించి 73 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అతనికి రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు గణాంకాలు అంత గొప్పగా లేకపోయినా, ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే ఐపీఎల్ 2026లో సీఎస్కే తరపున తుది జట్టులో అతనికి చోటు ఖాయమనిపిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ యంగ్ టాలెంటును ప్రోత్సహిస్తుంది. 2025లో 30లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు, కానీ అతడిలోని టాలెంట్‌ను గుర్తించి వదులుకోలేదు. రామకృష్ణ ఘోష్ ఇప్పుడు చేస్తున్న రికార్డులు చూస్తుంటే, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో చెన్నైకి మరో శార్దూల్ ఠాకూర్ దొరికాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
