Ravi Singh : వైభవ్ సూర్యవంశీ రికార్డు గల్లంతు.. మూడు మ్యాచ్‌ల్లోనే 19 సిక్సర్లు..రాజస్థాన్ రాయల్స్ కు దొరికిన వజ్రం!
Ravi Singh : విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ 16 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు రవి సింగ్ ఆ రికార్డును దాటి 19 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 273 పరుగులు చేసిన రవి సింగ్ సగటు 136.5గా ఉండటం విశేషం.

Ravi Singh : విజయ్ హజారే ట్రోఫీలో సిక్సర్ల సునామీ కొనసాగుతోంది. ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని సైతం వెనక్కి నెట్టి రైల్వేస్ వికెట్ కీపర్ బ్యాటర్ రవి సింగ్ కొత్త సిక్సర్ కింగ్‌గా అవతరించాడు. కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 19 భారీ సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. లెఫ్ట్ హ్యాండ్ కలిగిన ఈ పవర్‌ఫుల్ బ్యాటర్ తన వినాశకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలలా మారాడు.
ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో రవి సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సర్వీసెస్ జట్టుతో జరిగిన తాజా మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే 88 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు వైభవ్ సూర్యవంశీ 16 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు రవి సింగ్ ఆ రికార్డును దాటి 19 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 273 పరుగులు చేసిన రవి సింగ్ సగటు 136.5గా ఉండటం విశేషం. అతని స్ట్రైక్ రేట్ 138కి పైగా ఉండటం చూస్తుంటే, వన్డే మ్యాచ్‌ను కూడా టీ20లా మార్చేస్తున్నాడని అర్థమవుతోంది.
రవి సింగ్ ఫామ్ చూస్తుంటే ఎవరూ అతడిని ఆపలేకపోతున్నారు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 81 బంతుల్లోనే అజేయమైన 109 పరుగుల సెంచరీతో రైల్వేస్ జట్టును గెలిపించాడు. ఆ తర్వాత బలమైన ఆంధ్రప్రదేశ్ జట్టుపై 70 బంతుల్లో 76 పరుగులు చేసి తన నిలకడను చాటుకున్నాడు. తాజాగా సర్వీసెస్‌పై 46 బంతుల్లోనే 88 పరుగులు బాది తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ల పరంపరను కొనసాగించాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ రవి సింగ్ 50కి పైగా పరుగులు సాధించడం విశేషం.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రవి సింగ్ ప్రతిభను గుర్తించి 95 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. యూపీ టీ20 లీగ్‌లో కూడా రవి తన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు మ్యాచ్‌ను ఫినిష్ చేయగల సత్తా ఉండటంతో ఐపీఎల్ 2026 సీజన్లో అతడు రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉంది. రియాన్ పరాగ్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లతో కలిసి రవి సింగ్ ఐపీఎల్ గ్రౌండ్లలో సిక్సర్ల వర్షం కురిపిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
రవి సింగ్ ఇన్నింగ్స్‌లు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఈ స్థాయి ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే టీమ్ ఇండియా తలుపులు తట్టడం ఖాయం. అద్భుతమైన టైమింగ్, భీకరమైన పవర్ తో బంతిని స్టాండ్స్ లోకి పంపడంలో రవి సింగ్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
