Vidya Vasula Aham OTT: డైరెక్టుగా ఓటీటీలోకి ‘విద్యా వాసుల అహం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోటబొమ్మాళి పీఎస్ మూవీ ఫేమ్ రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం విద్యా వాసుల అహం. మణికాంత్ గెల్లి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Vidya Vasula Aham OTT: డైరెక్టుగా ఓటీటీలోకి 'విద్యా వాసుల అహం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Vidya Vasula Aham Movie
Follow us

|

Updated on: May 12, 2024 | 9:51 PM

కోటబొమ్మాళి పీఎస్ మూవీ ఫేమ్ రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం విద్యా వాసుల అహం. మణికాంత్ గెల్లి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ లోనే టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ ప్లాన్ మారింది. నేరుగా ఓటీటీలోనే విద్యా వాసుల అహం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో మే 17 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ‘అహం తో కూడిన ప్రేమ కథ చెప్పడానికి, MAY 17 న వస్తున్నారు, విద్యా. వాసు. గెట్ రెడీ ఫర్ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ’ అంటూ దీనికి ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఎటర్నెటీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై లక్ష్మి నవ్య, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్టా సంయుక్తంగా ఈ విద్యా వాసుల అహం సినిమాను నిర్మించారు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే… కొత్తగా పెళ్లయిన వాసు (రాహుల్ విజయ్), విద్య (శివానీ రాజశేఖర్) ఈగో సమస్యలు తలెత్తుతాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. పైచేయి సాధించాలనుకుంటారు. మరి ఈగో వారి బంధంపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే విద్యా వాసుల అహం సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మే 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ