Ravi Teja: మాస్ మహరాజా మాటంటే మాటే.. తన సినిమాలో బిగ్ బాస్ అమర్‌దీప్‌కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ

మాస్ మహరాజా రవితేజ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన సినిమాలో బిగ్ బాస్ రన్నరప్ అమర్‌ దీప్ చౌదరికి మంచి రోల్ ఇస్తానంటూ ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వేదికగా మాటిచ్చాడు రవితేజ. మాటిచ్చినట్లుగానే అమర్ దీప్ కు తన మూవీలో ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. తాజాగా అమర్‌ దీప్ మాస్ మహరాజాను‌ కలుసుకున్నాడు.

Ravi Teja: మాస్ మహరాజా మాటంటే మాటే.. తన సినిమాలో బిగ్ బాస్ అమర్‌దీప్‌కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ
Ravi Teja, Amardeep
Follow us

|

Updated on: May 11, 2024 | 8:28 PM

మాస్ మహరాజా రవితేజ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన సినిమాలో బిగ్ బాస్ రన్నరప్ అమర్‌ దీప్ చౌదరికి మంచి రోల్ ఇస్తానంటూ ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వేదికగా మాటిచ్చాడు రవితేజ. మాటిచ్చినట్లుగానే అమర్ దీప్ కు తన మూవీలో ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. తాజాగా అమర్‌ దీప్ మాస్ మహరాజాను‌ కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చినట్లు అందులో తెలిపాడు ‘ఫైనల్లీ మాస్ మహరాజాతో, ఎట్టకేలకు నా కల సాకారమైంది. రవితేజ అన్నా లవ్యూ.. నా దేవుడు నీవేనయ్యా! ఫ్యాన్ బాయ్ మూమెంట్.. మీరంటే చెప్పలేనంత పిచ్చి నాకు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు అమర్ దీప్. ప్రస్తుతం బిగ్ బాస్ రన్నరప్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘రవితేజ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దటీజ్ మాస్ మహరాజా’ అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమర్ దీప్ చౌదరి. తన ఆట తీరు, మాటతీరుతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఇదే బిగ్ బాస్ వేదికగా రవితేజ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు రవితేజ. బిగ్ బాస్ టైటిల్ రేసు నుంచి తప్పుకుంటే మాస్ మహరాజా సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని నాగార్జున ఆఫర్ ఇస్తే అందుకు కూడా సై అ న్నాడీ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇలా తనపై అమర్ చూపిన అభిమానానికి రవితేజ కూడా ఫిదా అయ్యాడు. తన సినిమాలో తప్పకుండా ఛాన్స్ ఇస్తానని అదే బిగ్ బాస్ వేదికగా అమర్ కు మాటిచ్చాడు. ఇప్పుడదే మాటను మాస్ మహరాజా నిలబెట్టుకున్నాడు. దీంతో అమర్ దీప్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం  మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు రవితేజ. హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో ‘RT75’  (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు మాస్ మహరాజా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో