IPL 2024: ‘ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో’.. కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్ పై మహ్మద్ షమీ ఆగ్రహం

క్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత, ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బహిరంగంగా తిట్టడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటన తర్వాత సంజీవ్ గోయెంకాపై విమర్శల వర్షం కురుస్తోంది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఒక ఆటగాడిని పట్టుకుని ఇలా బహిరంగంగా దూషించడం సరికాదంటూ లక్నో ఓనర్ కు సూచిస్తున్నారు

IPL 2024: 'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్ పై మహ్మద్ షమీ ఆగ్రహం
Mohammed Shami
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2024 | 8:00 PM

IPL 2024 సీజన్ క్రమంగా చివరి దశకు చేరుకుంది. గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి టోర్నీలో పెద్దగా వివాదాలేవీ కనిపించలేదు. అంపైర్ల నిర్ణయాలపై చిన్న చిన్న వివాదాలు ఉన్నా కానీ పెద్ద డ్రామా కనిపించలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత, ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బహిరంగంగా తిట్టడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటన తర్వాత సంజీవ్ గోయెంకాపై విమర్శల వర్షం కురుస్తోంది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఒక ఆటగాడిని పట్టుకుని ఇలా బహిరంగంగా దూషించడం సరికాదంటూ లక్నో ఓనర్ కు సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా కేఎల్ రాహుల్ కు బాసటగా నిలిచాడు. అదే సమయంలో సంజీవ్ గోయెంకాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న షమీ ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే, అతను త్వరగా కోలుకుంటున్నాడు.

క్రిక్‌బజ్ లైవ్‌షోలో పాల్గొన్న షమీ సంజీవ్ గోయెంకా తీరుపై మండిపడ్డాడు షమీ.. ‘ మిమ్మల్ని కోట్లాది మంది చూస్తారు. కెమెరా ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే ఆ దృశ్యం తెరపై కనిపిస్తే చాలా సిగ్గుచేటు. మాట్లాడటానికి ఒక హద్దు ఉండాలి. ఇది చాలా తప్పుడు సందేశాన్ని పంపుతుంది. ఆటగాళ్లకు ప్రతిచోటా గౌరవం ఉంది. యజమానిగా, మీరు కూడా గౌరవప్రదమైన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. మీరు దీన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో లేదా టీమ్ హోటల్‌లో చేయవచ్చు. అయితే మైదానంలో ఇలా చేయాల్సిన అవసరం లేదు. కేఎల్ రాహుల్ ఓ జట్టుకు కెప్టెన్ . అతను సాధారణ ఆటగాడు కాదు. క్రికెట్ అనేది ఒక జట్టు క్రీడ. వ్యూహం విజయవంతం కాకపోతే పెద్ద విషయం కాదు. ఆటలో ఏదైనా జరగవచ్చు. ప్రతి ఆటలోనూ గెలుపు, ఓటమి ఉంటాయి. ఆటలో ఎన్నో ఉద్విగ్న క్షణాలు ఉంటాయి. ఆటగాళ్ళు కూడా ఒకరిపై ఒకరు అరుచుకుంటారు. ఇది క్రికెట్‌లోనే కాదు అన్ని క్రీడల్లోనూ జరుగుతుంది. ఒక ఆటగాడు మరో ఆటగాడితో ఇలా ప్రవర్తించడం సహజం. అయితే బయటి నుంచి వచ్చిన ఎవరైనా ఆటగాళ్లతో ఇలా మాట్లాడటం సరికాదు’అని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..