Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘మీ ప్రేమకు బానిసలం’.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టిన అల్లు అర్జున్, సంపూర్ణేష్

జనసేన అధినేతకు మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ తదితరులు పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ నటీనటులు సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, కిర్రాక్ ఆర్పీ, నిర్మాత నాగవంశీ తదితరులు పవన్ ని గెలిపించాలని పిఠాపురం ఓటర్లను స్వయంగా కోరారు

Pawan Kalyan: 'మీ ప్రేమకు బానిసలం'.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టిన అల్లు అర్జున్, సంపూర్ణేష్
Sampoornesh Babu, Allu Arjun, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2024 | 5:49 PM

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. పోలింగ్ కు సమయం ముంచుకొస్తుండడంతో పార్టీలన్నీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి. ఇదిలా ఉంటే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారాహి యాత్రలో భాగంగా ఇప్పటికే పలుసార్లు పిఠాపురంలో పర్యటించారు పవన్. ఇక జనసేన అధినేతకు మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ తదితరులు పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ నటీనటులు సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, కిర్రాక్ ఆర్పీ, నిర్మాత నాగవంశీ తదితరులు పవన్ ని గెలిపించాలని పిఠాపురం ఓటర్లను స్వయంగా కోరారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, న్యాచురల్ స్టార్ నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్ తదితరులు పవన్ గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా పిఠాపురం ప్రజలను కోరారు. తాజాగా మరికొందరు టాలీవుడ్ హీరోలు పవన్ కు బాసటగా నిలిచారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు జనసేన అధినేతకు మద్దతుగా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్..

‘ఎన్నికల ప్రయాణంలో బిజీగా ఉంటోన్న పవన్ కల్యాణ్‌ కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆయన ఎంచుకున్న మార్గాన్ని, అందులో ఆయన చూపించే నిబద్ధత, కార్యదీక్షతకు నేను ఎప్పుడు గర్విస్తుంటా. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమా, మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు గెలుపొందాలని, కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు అల్లు అర్జున్.

పవన్ తో సంపూర్ణేష్ బాబు..

ఇక పవన్ తో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన సంపూర్ణేష్ బాబు .. ‘ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస. మీ సంపూర్ణేష్ బాబు’ అని రాసుకొచ్చారు.

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే