- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Jasprit Bumrah's Son Angad Makes 1st Public Appearance During MI vs SRH Clash At Wankhede Stadium Mumbai
IPL 2024: బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! అప్పుడే మ్యాచ్ చూడడానికి వచ్చేశాడుగా.. ఫొటోస్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కుమారుడి తొలి ఫొటో బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో 'జూనియర్ బుమ్రా' తన తల్లి సంజనా గణేషన్‌తో కలిసి వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు.
Updated on: May 07, 2024 | 8:45 PM

1. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కుమారుడి తొలి ఫొటో బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో 'జూనియర్ బుమ్రా' తన తల్లి సంజనా గణేషన్‌తో కలిసి వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా కుమారుడు తన తండ్రికి మద్దతుగా ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి గ్యాలరీలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించిన అంగద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో బుల్లి బుమ్రా తన తల్లి ఒడిలో కూర్చుని మ్యాచ్ చూస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోను తెగ లైక్ చేస్తున్నారు.

బుమ్రా తనయుడు స్టేడియానికి రావడం ఇదే తొలిసారి. ఇ్క జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేష్ సోమవారం (మే 6) తన పుట్టినరోజును జరుపుకుంది.

జస్ప్రీత్ బుమ్రా 15 మార్చి 2021న స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 2023న, సంజన ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత, బుమ్రా అభిమానులు అతని కుమారుడి మొదటి ఫొటో కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ లో ఈ కల నెరవేరింది.




