- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Rajasthan Royals Captain Sanju Samson Breaks CSK Player MS Dhoni’s Record
IPL 2024: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలో ఎంతమంది ఉన్నారంటే?
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో కేవలం 10 మంది బ్యాట్స్‌మెన్స్ మాత్రమే 200+ సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 9వ స్థానానికి చేరుకున్నాడు. దీంతో పాటు ధోనీ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును కూడా మహేంద్ర సింగ్ బద్దలు కొట్టాడు.
Updated on: May 08, 2024 | 6:02 PM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2024) 56వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తరపున శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన శాంసన్ 46 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. ఈ 6 సిక్సర్లతో మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న గొప్ప రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 200 సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. కేవలం 165 ఇన్నింగ్స్‌ల్లోనే ధోనీ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సంజూ శాంసన్ చెరిపేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లతో సంజూ శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లో 200 సిక్సర్లు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో రెండు వందల సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

సంజూ శాంసన్ అర్ధ సెంచరీతో చెలరేగినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేదు. 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.





























