AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ కోసం సూర్య ఏం చేస్తున్నాడో తెలుసా?మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి మరీ..

జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియాను ప్రకటించారు. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ కోసం సూర్య ఏం చేస్తున్నాడో తెలుసా?మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి మరీ..
Suryakumar Yadav
Basha Shek
|

Updated on: May 07, 2024 | 8:14 PM

Share

జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియాను ప్రకటించారు. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసిన తర్వాత, కామెంటరీ ప్యానెల్ అతన్ని చాలా ప్రశ్నలు అడిగారు. ఈసారి టీ20 ప్రపంచకప్ గురించి కూడా చెప్పాడు. టీ20 ప్రపంచకప్ తమ మైండ్ లో ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నామని కూడా తెలిపారు. ఇందుకోసం మధ్యాహ్నం ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఉన్న అనంత్ త్యాగి, పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజాలు సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. టీ20 ప్రపంచకప్‌ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని సూర్యకుమార్ యాదవ్‌ను అడిగారు. ఈ నేపథ్యంలో తమ టీ20 ప్రపంచకప్ సన్నహకాల గురించి చెప్పుకొచ్చాడీ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్

మధ్యాహ్నం గ్రౌండ్ కు వెళ్లి..

‘‘ప్రస్తుతం మేం ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ మా మైండ్ లో మొత్తం టీ20 ప్రపంచకప్ ఉంది . ఇందుకోసం గ్రౌండ్‌కి వెళ్లి మధ్యాహ్నం ప్రాక్టీస్ చేస్తున్నాను. దీని వెనుక కారణం ఏమిటంటే, యుఎస్ వెస్టిండీస్‌లో మ్యాచ్‌లు పగటిపూట జరగనున్నాయి. ఇందుకోసం పగలు కూడా బ్యాటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక నుంచి అది అలవాటు అవుతుంది. అక్కడికి వెళ్లినప్పుడు కొత్తగా ఏమీ అనిపించదు’అని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు రాత్రిపూట జరుగుతాయి. దీంతో పగటిపూట జరిగే మ్యాచ్‌లో ఆటగాళ్లు ఇబ్బంది పడవచ్చు. సో సూర్యకుమార్ యాదవ్ రోజు పగలు సాధన చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ సెంచరీ టీమ్ ఇండియాకు నిజమైన బూస్టర్ లాంటిది. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత అమెరికా, కెనడాతో మ్యాచ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టీ 20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

రిజర్వ్స్:

శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..