బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర భయంకరుడు.. ఎవరో తెల్సా.!
ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. రాజస్తాన్, కోల్‌కతా జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసులోకి వెళ్లిపోగా.. మరో రెండు స్థానాల కోసం సన్‌రైజర్స్, చెన్నై, లక్నో మధ్య చిన్న సైజు యుద్దమే జరుగుతోందని చెప్పాలి. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ విషయానికొస్తే.. 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి..
ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. రాజస్తాన్, కోల్‌కతా జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసులోకి వెళ్లిపోగా.. మరో రెండు స్థానాల కోసం సన్‌రైజర్స్, చెన్నై, లక్నో మధ్య చిన్న సైజు యుద్దమే జరుగుతోందని చెప్పాలి. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ విషయానికొస్తే.. 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి.. మూడింట ఓడి.. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. కేకేఆర్ విజయాల్లో ఓపెనర్లు కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండూ విభాగాల్లోనూ సత్తా చాటాడు వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ నరైన్. చివరిగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ 39 బంతుల్లో 81 పరుగులు చేసి.. ప్రత్యర్ధి బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపించాడు నరైన్. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు.
బ్యాటింగ్‌లో 1500కిపైగా పరుగులు, బౌలింగ్‌లో 150కి పైగా వికెట్లు తీసిన మూడో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు సునీల్ నరైన్. ఈ లిస్టులో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో ముందు వరుసలో ఉన్నారు. గంభీర్ మళ్లీ కేకేఆర్‌కి ప్రధాన కోచ్‌గా అయిన పుణ్యమా అని.. సునీల్ నరైన్ లోని ఆల్‌రౌండర్ మళ్లీ పుట్టుకొచ్చాడు. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచ్‌ల్లో 46 ఫోర్లు, 32 సిక్సర్లతో 461 పరుగులు చేశాడు నరైన్. అటు బౌలింగ్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. కేకేఆర్ జట్టుకు రియల్ విన్నర్‌గా నరైన్ మారాడని ఐపీఎల్ ఫ్యాన్స్ అంటుంటే.. వెస్టిండీస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశతో ఉన్నారు. ఐపీఎల్‌లో నరైన్ భయంకర ఫామ్‌లో ఉన్నప్పటికీ.. విండీస్ జట్టులో లేడని అంటున్నారు. నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నరైన్ టీ20 ప్రపంచకప్‌నకు తమ జట్టులో ఉండి ఉంటే బాగుండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
What are the Caribbean boys talking about? 🤔💬 pic.twitter.com/BJRFrXBmxh
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024