DC vs RR, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులోకి టీమిండియా సీనియర్ ప్లేయర్

Delhi Capitals Vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం.

DC vs RR, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులోకి టీమిండియా సీనియర్ ప్లేయర్
DC vs RR, IPL 2024
Follow us
Basha Shek

|

Updated on: May 07, 2024 | 7:15 PM

Delhi Capitals Vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్‌లోకి చేరడం ఖాయం. మరోవైపు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. దీంతో నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి హోరాహోరీ పోరు ఆశించవచ్చు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల కెప్టెన్లు ఇద్దరూ టీ20 ప్రపంచకప్ కు ఎంపికయ్యారు. దీంతో ఈ ఇద్దరి కెప్టెన్ అండ్ వికెట్‌ కీపర్‌ నేతల పోరు ఆసక్తికరంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శామ్సన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి తొలుత ఢిల్లీ బ్యాటింగ్ కు దిగనుంది.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్  అండ్ వికెట్ కీపర్ ), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్, కునాల్ సింగ్ రాథోర్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్  అండ్ వికెట్ కీపర్ ), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా

గెలవాలంటే నిలవాల్సిందే…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..