Rathnam OTT: అప్పుడే ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం. పోలీస్, యాక్షన్, ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 26 న తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజైన రత్నం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా మంచిగా వచ్చాయి.

Rathnam OTT: అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Rathnam Movie
Follow us
Basha Shek

|

Updated on: May 07, 2024 | 7:51 AM

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం. పోలీస్, యాక్షన్, ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 26 న తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజైన రత్నం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా మంచిగా వచ్చాయి. ఊహకందని ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్‌ ఆడియన్స్‌ను బాగానే మెప్పించాడు రత్నం. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన విశాల్ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రత్నం సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంత చేసుకుంది. హీరోగా విశాల్ కు, డైరెక్టర్ గా హరికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓటీటీ డీల్ భారీగానే కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మే 24 నుంచే విశాల్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం నిర్మించిన రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ రత్నం సినిమాకు స్వరాలందించారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా టిఎస్ జై ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామికి (స‌ముద్ర‌ఖ‌ని) ర‌త్నం (విశాల్ ) న‌మ్మిన బంటుగా ఉంటాడు. అలాంటి ర‌త్నం జీవితంలోకి అనుకోకుండా మ‌ల్లిక (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) అనే అమ్మాయి వ‌స్తుంది. అయితే మ‌ల్లిక‌ను చంప‌డానికి లింగం బ్ర‌ద‌ర్స్ ప్ర‌య‌త్నిస్తుంటారు. మరి లింగం బ్ర‌ద‌ర్స్ బారి నుంచి మ‌ల్లిక‌ను ర‌త్నం ఎలా కాపాడాడు? ర‌త్నం గ‌త జీవితం మొత్తం క‌ష్టాల మ‌యం కావ‌డానికి కార‌కులు ఎవ‌రు? త‌న శ‌త్రువుల‌పై ర‌త్నం ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో తెలియాలంటే రత్నం సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే