IPL 2024: ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో గోల్డెన్ డక్

ఐపీఎల్ 17వ సీజన్ 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై పంజాబ్ కు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు 139 పరుగులకే ఆలౌటైంది.

IPL 2024: ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో గోల్డెన్ డక్
Shivam Dube
Follow us
Basha Shek

|

Updated on: May 05, 2024 | 10:19 PM

ఐపీఎల్ 17వ సీజన్ 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై పంజాబ్ కు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు 139 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ విజయం చెన్నై జట్టుకు ప్లేఆఫ్ పరంగా చాలా లాభించింది. కానీ ఆ జట్టు స్టార్ బ్యాటర్ శివమ్ దూబే పేలవ ప్రదర్శన జట్టుకు తలనొప్పిగా మారింది. దూబే ప్రదర్శన సీఎస్‌కే జట్టునే కాకుండా భారత జట్టును కూడా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు శివమ్ దూబే టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. జట్టు మిడిల్ ఆర్డర్‌కు దూబే ప్రాణం అని కూడా భావిస్తున్నారు. అయితే టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన తర్వాత దూబే దారుణంగా విఫలమవుతున్నాడు. దూబే ఆడిన రెండు వరుస మ్యాచ్‌ల్లోనూ తొలి బంతికే వెనుదిరిగాడు. అంటే రెండు మ్యాచ్‌ల్లోనూ దూబే బ్యాట్‌ నుంచి ఒక్క పరుగు కూడా రాలేదు. దీంతో సెలక్షన్ బోర్డుకు కొత్త తలనొప్పి వచ్చింది.

అంతకుముందు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే గోల్డెన్ డక్ అయ్యాడు. ఇప్పుడు పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ తొలి బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. కాగా రెండు మ్యాచ్‌ల్లోనూ దూబే స్పిన్నర్‌ చేతిలోనే ఔటవ్వడం గమనార్హం. ఎందుకంటే దూబే స్పిన్నర్లపై అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన శివమ్ దూబే 11 ఇన్నింగ్స్‌ల్లో 350 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 61 మ్యాచ్‌లు ఆడిన దూబే 1456 పరుగులు చేశాడు. లీగ్‌లో 9 అర్ధశతకాలు కూడా సాధించాడు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకు ముందు ప్రపంచకప్‌కు భారత జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో చాలా మంది టీమిండియా ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇందులో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, శివమ్ దూబే కూడా ఉన్నారు. వరల్డ్‌కప్‌కు ముందు ఈ కీలక ఆటగాళ్లు వరుసగా విఫలమవుతుండడంతో టీమిండియా అభిమానుల్లో టెన్షన్‌ కూడా పెరిగింది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: సామ్ కర్రాన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, రిలే రోసో, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబడ మరియు అర్ష్‌దీప్ సింగ్.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్ మరియు తుషార్ దేశ్‌పాండే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..