IPL 2024 : ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ధోని.. వీడియో చూసి హ్యాట్సాఫ్ చెబుతోన్న ఫ్యాన్స్

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెరుపు ఇన్నింగ్స్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. సీఎస్కే కూడా ఇప్పటివరకు టోర్నీలో మంచి ప్రదర్శన చేసింది. ఇప్పుడు చెన్నై తదుపరి మ్యాచ్‌ని ధర్మశాలలో ఆడవలసి ఉంది. అయితే దీనికి ముందు ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2024 : ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ధోని.. వీడియో చూసి హ్యాట్సాఫ్ చెబుతోన్న ఫ్యాన్స్
MS Dhoni
Follow us
Basha Shek

|

Updated on: May 04, 2024 | 8:59 PM

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెరుపు ఇన్నింగ్స్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. సీఎస్కే కూడా ఇప్పటివరకు టోర్నీలో మంచి ప్రదర్శన చేసింది. ఇప్పుడు చెన్నై తదుపరి మ్యాచ్‌ని ధర్మశాలలో ఆడవలసి ఉంది. అయితే దీనికి ముందు ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు మిస్టర్ కూల్‌కు సెల్యూట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎంఎస్ ధోని తన బాడీగార్డ్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతని పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించాడు. ధోని చేసిన ఈ పనికి సదరు బాడీ గార్డ్ ఎమోషనల్ అయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోని ముందుగా తన బాడీగార్డును కూర్చోమని అడిగాడు. ఆ తర్వాత కేక్ కటింగ్ వేడుకలో ఓ పాట పాడమని అక్కడున్న అతిథులను ధోనీ కోరాడు. దీంతో అందరూ హ్యాపీ బర్త్‌డే పాట పాడటం ప్రారంభించారు. ఆవెంటనే బాడీగార్డ్ భావోద్వేగానికి గురై ఏడవడం ప్రారంభించాడు.

ధోనీ ఇప్పుడు ధర్మశాల మైదానంలో దిగనున్నాడు. మే 5న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చివరి మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. గత ఐదు మ్యాచ్‌ల్లో చెన్నైపై పంజాబ్‌ విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే జరిగితే ప్లే ఆఫ్ రేసులో సీఎస్‌కే గల్లంతవ్వడం ఖాయం.

ఇవి కూడా చదవండి

బాడీ గార్డ్ బర్త్ డే వేడుకల్లో ధోని.. వీడియో ఇదిగో..

చెన్నై జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. చెన్నైకి ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉండగా సెమీఫైనల్‌కు వెళ్లాలంటే కనీసం 3 మ్యాచ్‌లు గెలవాలి. ఒకవేళ ఆ రెండు మ్యాచ్‌లు ఓడిపోతే, CSK కేవలం 14 పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగలదు. ఆ తర్వాత నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి వస్తుంది.

ధర్మశాలలో ధోని.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..