AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా జట్టు ఎంపిక.. లిస్టులో 5 గురు భారత సంతతి ఆటగాళ్లు

క్రికెట్ ప్రపంచం నుంచి ఒక ఆసక్తికర బయటకు వచ్చింది. రాబోయే ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం ఆతిథ్య USA తన జట్టును ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. USA ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లను చేర్చుకుంది. రిజర్వ్‌లుగా ముగ్గురికి అవకాశం కల్పించారు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా జట్టు ఎంపిక.. లిస్టులో 5 గురు భారత సంతతి ఆటగాళ్లు
USA Cricket Team
Basha Shek
|

Updated on: May 04, 2024 | 8:15 AM

Share

క్రికెట్ ప్రపంచం నుంచి ఒక ఆసక్తికర బయటకు వచ్చింది. రాబోయే ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం ఆతిథ్య USA తన జట్టును ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. USA ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లను చేర్చుకుంది. రిజర్వ్‌లుగా ముగ్గురికి అవకాశం కల్పించారు. భారత సంతతికి చెందిన మోనాక్ పటేల్ అమెరికా జట్టుకు నాయకత్వం వహిస్తారు. అతనితో పాటు భారత మూలాలున్న సౌరభ్ నేత్రవాల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్ అమెరికా జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే భారత్‌ను వదిలి అమెరికాకు క్రికెట్ ఆడిన ఉన్ముక్త్ చంద్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉన్ముక్త్ చంద్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. అదే సమయంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కోరీ అండర్సన్ కూడా జట్టులోకి వచ్చాడు ICC ODI ప్రపంచకప్ 2015లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ రన్నరప్ జట్టులో కోరీ సభ్యుడు. అండర్సన్‌కు 13 టెస్టులు, 49 వన్డేలు, 33 టీ20ల అనుభవం ఉంది. అండర్సన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. కాబట్టి USA ఒక ప్రధాన టోర్నమెంట్‌లో అతని అనుభవం నుండి ప్రయోజనం పొందవచ్చు.

జూన్ 12న టీమ్ ఇండియా vs USA

ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ 20 జట్లను 5-5తో 4 గ్రూపులుగా విభజించారు. దీని ప్రకారం టీమ్ ఇండియా గ్రూప్-ఎలో ఉంది. టీమ్ ఇండియాతో పాటు ఈ గ్రూప్‌లో అమెరికా, ఐర్లాండ్, పాకిస్థాన్, కెనడా ఉన్నాయి. జూన్ 12న టీమ్ ఇండియా వర్సెస్ అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్‌లో ఒక్కో జట్టు 4 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడో మ్యాచ్ అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

ICC T20 ప్రపంచ కప్ కోసం USA జట్టు:

మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గోస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, JC సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవాల్కర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్.

రిజర్వ్‌లు:

గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్‌డేల్, యాసిర్ మహమ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో