Shah Rukh Khan: షారుక్‌, హృతిక్‌లతో ఉన్న ఈ అమ్మాయిలంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?

సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఇక తమ పుట్టిన రోజు వేడుకలు, ఇతర సందర్భాల్లోనూ హీరోలు, హీరోయిన్లు తమ చైల్డ్ హుడ్ ఫొటోస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటారు. అభిమానులు కూడా ఈ త్రో బ్యాక్ ఫొటోస్ పై తెగ ఆసక్తి చూపిస్తుంటారు. సినిమా రంగంలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారంతా చిన్న తనంలో ఎలా ఉంటారోనని తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు

Shah Rukh Khan: షారుక్‌, హృతిక్‌లతో ఉన్న ఈ అమ్మాయిలంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?
Bollywood Actors
Follow us
Basha Shek

|

Updated on: May 03, 2024 | 5:43 PM

సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఇక తమ పుట్టిన రోజు వేడుకలు, ఇతర సందర్భాల్లోనూ హీరోలు, హీరోయిన్లు తమ చైల్డ్ హుడ్ ఫొటోస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటారు. అభిమానులు కూడా ఈ త్రో బ్యాక్ ఫొటోస్ పై తెగ ఆసక్తి చూపిస్తుంటారు. సినిమా రంగంలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారంతా చిన్న తనంలో ఎలా ఉంటారోనని తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అలా ఇప్పుడు ఒక త్రో బ్యాక్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌లతో కొందరు స్టార్ కిడ్స్ కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా పెద్దయ్యారు. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. మరి వారెవరో గుర్తు పట్టారా? హిందీ సినిమాలు చూసే వారు ఇట్టే గుర్తుపట్టచ్చు. వారు మరెవరో కాదు చుంకీ పాండే కూతురు లైగర్ ఫేమ్ అనన్య పాండే అలాగే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.

ఇవి కూడా చదవండి

షారుక్, చుంకీల మధ్య స్నేహం..

షారుఖ్ ఖాన్, చుంకీ పాండే స్నేహితులు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌ బాద్‌ షా వెలుగొందుతున్నాడు. అలాగే చుంకీ పాండే కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. షారుక్ ఖాన్, చుంకీల మధ్య ఇప్పటికీ స్నేహం ఉంది. విశేషమేమిటంటే వారి పిల్లల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. చుంకీ పాండే కూతురు అనన్య పాండే, షారుఖ్ పిల్లలు సుహానా ఖాన్-ఆర్యన్ ఖాన్ మంచి స్నేహితులు.

గతంలో అనన్య పాండే, సుహానా ఖాన్ కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. వారు అప్పుడు చాలా చిన్నవారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోకు అభిమానుల నుంచి విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. చాలామంది వీరిని త్వరగా గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు. అనన్య, సుహానా ఇప్పుడు గ్లామరస్ గా ఉన్నారు.

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లుగా..

అనన్య పాండేకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మంచి గుర్తింపు ఉంది. ఆమె నటించిన మొదటి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సూపర్ హిట్గా నిలిచింది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమాలోనూ నటించి మెప్పించిందీ అందాల తార. గతేడాది ఆమె నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ‘ది ఆర్చీస్’ సినిమా ద్వారా సుహానా ఖాన్ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది ఈ చిత్రం నేరుగా OTT ద్వారా విడుదలైంది. అమెరికాలో నటనలో శిక్షణ పొందారామె. ఇప్పుడు ఆమె ఓ కొత్త సినిమా

లో నటిస్తుండగా, ఈ సినిమాకు షారుక్ ఖాన్ పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూడా నటిస్తాడని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా