- Telugu News Photo Gallery Cinema photos Anushka Sharma Celebrates Her Birthday With Virat Kohli Maxwell And Faf Du Plessis, See Photos
Anushka Sharma: బెంగళూరులో అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్ చూశారా?
ప్రముఖ బాలీవుడ్ నటి, టీమ్ ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ బర్త్ డే పార్టీలో విరాట్ కోహ్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులు సందడి చేశారు. ప్రస్తుతం అనుష్క బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: May 03, 2024 | 6:42 PM

ప్రముఖ బాలీవుడ్ నటి, టీమ్ ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ బర్త్ డే పార్టీలో విరాట్ కోహ్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులు సందడి చేశారు. ప్రస్తుతం అనుష్క బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ప్రముఖ రెస్టారెంట్ లూపా లో నిర్వహించిన అనుష్క బర్త్ డే పార్టీలో ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్, అతని భార్య విని రామన్, అలాగే ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ తదితరులు హాజరయ్యారు.

ఆర్సీబీ ప్లేయర్లంతా కలిసి డిన్నర్‌ను ఎంజాయ్ చేశారు. అనంతరం ఫొటోలకు ఫోజులిస్తూ పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

విరాట్ కోహ్లీ – అనుష్కలది ప్రేమ వివాహం. 2017 డిసెంబర్ 11న ఇటలీలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. . ఈ జంటకు 2021లో వామిక జన్మించింది.

ఇక ఈఏడాది ఫిబ్రవరిలో విరుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. అనుష్క అకాయ్ అనే మగబిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది అనుష్క.