Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Guru OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘లవ్ గురు’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ రోమియో. తెలుగులో లవ్ గురు పేరుతో ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. నాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో గద్దల కొండ గణేశ్ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉండడం, తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించడంతో లవ్ గురు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Love Guru OTT: అప్పుడే ఓటీటీలోకి విజయ్ ఆంటోని 'లవ్ గురు'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Love Guru Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 30, 2024 | 8:11 PM

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ రోమియో. తెలుగులో లవ్ గురు పేరుతో ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. నాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో గద్దల కొండ గణేశ్ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉండడం, తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించడంతో లవ్ గురు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలోకి వచ్చాక ఆ అంచనాలను అందుకోలేకపోయిందీ మూవీ. తమిళ్ తో పాటు తెలుగులోనూ పెద్దగా కలెక్షన్లు రాలేదు. దీంతో లవ్ గురు అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని తెలుస్తోంది. తమిళంలో రోమియో సినిమా ఆహా తమిళ్ లో మే 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం. అయితే తెలుగులో లవ్ గురు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దగ్గర కూడా ఉన్నాయి. మరి లవ్ గురు సినిమా ఆహాలో వస్తుందా లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుందా? లేదా రెండింటిలోనూ స్ట్రీమింగ్ కు వస్తుందా అన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.

లవ్ గురు సినిమాలో యోగి బాబు, వీటీవీ గణేశ్, ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్, శ్రీజ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను హీరో విజయ్ ఆంటోని సతీమణి మీరా ఆంటోని నిర్మించడం విశేషం. భరత్ ధన శేఖర్ స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మలేషియాలో బిజినెస్ చేసే అరవింద్ (విజయ్ ఆంటోనీ) తిరిగి తన సొంతూరుకు వస్తాడు. అక్కడ లీల (మృణాళిని రవి) ను చూసి ఇష్టపడతాడు. ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే ఈ పెళ్లి లీలకు ఈ పెళ్లి ఇష్టం లేదని అరవింద్ కు అర్ధమవుతుంది. అయితే ఎలాగైనా లీల మనసును గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు? మరి లీల మనసును అరవింద్ గెలిచాడా?లేదా?అన్నది తెలుసుకోవాలంటే లవ్ గురు సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్

పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోన్న లవ్ గురు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు