T20I World Cup: హార్దిక్ పాండ్యాకు ప్లేస్ ఉంటుందా? నేడే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి .అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్ పైనే ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో పరాజయం పాలైన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈసారైనా ఐసీసీ కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి .అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్ పైనే ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో పరాజయం పాలైన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈసారైనా ఐసీసీ కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయ. దీనికి ముందు, మొత్తం 20 జట్లు తమ ప్రపంచ కప్ జట్టును ప్రకటించడానికి మే 1 చివరి తేదీగా ఇచ్చింది ఐసీసీ. దీని ప్రకారం మే 1లోగా అన్ని జట్లు తమ జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. సోమవారం (ఏప్రిల్ 29న) న్యూజిలాండ్ తమ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఇప్పుడు 19 క్రికెట్ బోర్డులు తమ జట్టును ప్రకటించాల్సి ఉంది. టీమ్ ఇండియాకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచ కప్ లో చోటు ఆశిస్తున్నారు. కాగా ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా ప్రకటన ఎప్పుడు వస్తుందా? జట్టులో ఎవరు అవకాశం పొందుతారు? అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్త్ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత జట్లను ఎప్పుడు ప్రకటిస్తారు అనే దాని గురించిన అప్‌డేట్ వచ్చింది. నివేదికల ప్రకారం ఏప్రిల్ 30న టీమ్ ఇండియాను ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్‌లో పాల్గొనే ప్రధాన జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించవచ్చు. ఇద్దరికీ ప్రధాన, బ్యాకప్ వికెట్ కీపర్‌గా అవకాశం ఇవ్వొచ్చు. ఈ 2 స్థానాల కోసం మొత్తం 5 వికెట్ కీపర్లు పోటీలో ఉన్నారు. దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ 5 మంది పోటీలో ఉన్నారు. అయితే ఈ 5 మందిలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ లకే ఎక్కువ ప్రాధాన్యమివ్వనున్నారు.. దీంతో ఇప్పుడు ఎవరి పేరు ఖాయమనే దానిపై సెలక్షన్ కమిటీ దృష్టి పెట్టనుంది. మరోవైపు న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ 1 రిజర్వ్ ప్లేయర్‌తో 15 మంది ప్రధాన ఆటగాళ్లను రంగంలోకి దించింది. న్యూజిలాండ్‌కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు.
అహ్మాదాబాద్ లో బీసీసీఐ సెలెక్షన్ మీటింగ్..
Indian team for the T20I World Cup is likely to be announced tomorrow. [Devendra Pandey From Express Sports] pic.twitter.com/f9QA2aJibw
— Johns. (@CricCrazyJohns) April 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..