CSK vs SRH, IPL 2024: రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్ మిచెల్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే?
Chennai Super Kings vs Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ధాటిగా ఆడే క్రమంలో కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు
Chennai Super Kings vs Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ధాటిగా ఆడే క్రమంలో కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక పరుగులు చేయలేక తంటాలు పడుతోన్న డేరిల్ మిచెల్ ఈ మ్యాచ్ లో అర్ధసెంచరీ తో రాణించాడు. మొత్తం 32 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 52 పరుగులు చేసిన మిచెల్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఎప్పటిలాగే శివమ్ దూబే ( 20 బంతుల్లో 29 నాటౌట్, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు పెరిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై… నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆఖరులో బ్యాటింగ్ కు వచ్చిన ధోని (5 నాటౌట్) బౌండరీ కొట్టి అభిమానులను అలరించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, ఉనద్కత్, నటరాజన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
దూబే సిక్సర్ల ధమాకా..
🔛 & 🔛
ఇవి కూడా చదవండిShivam Dube muscles his way to more maximums tonight ✨
Watch the match LIVE on @officialjiocinema and @starsportsindia 💻📱#TATAIPL | #CSKvSRH pic.twitter.com/S8rKALC5ml
— IndianPremierLeague (@IPL) April 28, 2024
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరానా.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
💯 in the last match followed by a 5️⃣0️⃣ 🫡
Skipper Ruturaj Gaikwad setting the platform at the halfway stage 💛
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/I7Yupi7U09
— IndianPremierLeague (@IPL) April 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..