IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌లో సహనం కోల్పోయిన హార్దిక్.. అంపైర్లపై ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
ఢిల్లీ ప్లేయర్ల ధనాధన్ బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. ముఖ్యంగా వారిని నిలువరించేందుకు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలనేది హార్దిక్ కు అర్థం కాలేకపోయింది. ఈ సమయంలో ముంబై కెప్టెన్ కు మాజీ సారథి రోహిత్ శర్మ సహకరించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓ సందర్భంలో హార్దిక్ నేరుగా అంపైర్‌తో గొడవకు దిగాడు
ఐపీఎల్ 17వ సీజన్ 42వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ మొదటి బంతి నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్లను ఉతికి ఆరేసిన ఢిల్లీ బ్యాటర్లు కేవలం 10 ఓవర్లలో 128 పరుగులు చేశారు. ఢిల్లీ ప్లేయర్ల ధనాధన్ బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. ముఖ్యంగా వారిని నిలువరించేందుకు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలనేది హార్దిక్ కు అర్థం కాలేకపోయింది. ఈ సమయంలో ముంబై కెప్టెన్ కు మాజీ సారథి రోహిత్ శర్మ సహకరించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓ సందర్భంలో హార్దిక్ నేరుగా అంపైర్‌తో గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీ బ్యాటర్ల ఊచకోతతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆందోళనకు గురయ్యాడు. బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్ పడకపోవడంతో అసహనానికి లోనయ్యాడు. అయితే ముంబై బౌలర్లు ఎట్టకేలకు ఒక వికెట్ తీశారు. అయితే ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి బ్యాటర్ మైదానంలోకి రావడం ఆలస్యమైంది. దీంతో హార్దిక్‌కి కోపం వచ్చింది. నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే అంపైర్ సరిగా స్పందించకపోడంతో పాండ్యా తీవ్ర ఆగ్రహావేశానికి లోనైనట్లు సమాచారం.
.@delhicapitals‘ Flying Powerplay 🤩
Fraser-McGurk increases the temperature with some explosive stroke play 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvMI pic.twitter.com/e2VdyReaPu
— IndianPremierLeague (@IPL) April 27, 2024
ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం, ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయంలోగా ఇన్నింగ్స్‌ను ముగించాలి. దీనికి పూర్తి బాధ్యత ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌పై ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఆయా ఓవర్లను పూర్తి చేయడంలో సంబంధిత జట్టు విఫలమైతే, స్లో ఓవర్ రేట్ ప్రకారం కెప్టెన్‌కు జరిమానా విధిస్తారు. అందువల్ల, ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఆలస్యంగా మైదానంలోకి రావడంపై హార్దిక్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు.
Bro Hardik Pandya has completely lost it 🤑🤑pic.twitter.com/4GsNpqU7ES#DCvsMI
— Utkarsh (@utkarshh_tweet) April 27, 2024
ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:
Hardik Pandya standing on the boundary. Leader Rohit Sharma is setting the field.
This is a proper cinema ! 😭🔥pic.twitter.com/dbe325qvFE
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) April 27, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, రికీ భుయ్, సుమిత్ కుమార్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్, కుమార్ కార్తికేయ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..