HanuMan: తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. హనుమంతుని కథకు సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించి ఈ మూవీని రూపొందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది

HanuMan: తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
Hanuman Movie
Follow us

|

Updated on: Apr 26, 2024 | 10:39 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. హనుమంతుని కథకు సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించి ఈ మూవీని రూపొందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టింది. ఆపై ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ అందుకుంది. ఇటీవల 25 సెంటర్లలో సక్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది హనుమాన్. దీంతో పలువురు ప్రముఖులు ఈ సూపర్ హీరో సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హనుమాన్ చిత్ర బృందం తెలంగాణ గవర్నర్ సీపీ రాధా కృష్ణణ్ ను కలిసింది. ఈ సందర్భంగా గవర్నర్ వారితో ముచ్చటించారు. హనమాన్ సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, అంతే అద్భుతంగా నటించిన హీరో తేజ సజ్జాపై ప్రశంసలు కురిపించారు. . ఈ సందర్భంగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ గవర్నర్‌కు హనుమాన్ ప్రతిమను బహూకరించారు.

గవర్నర్ తో కలిసిన ఫొటోలు, విశేషాలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది హనుమాన్ టీమ్ యూనిట్. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి నిర్మించిన హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సజ్జా సోదరిగా నటించింది. అలాగే వాన ఫేమ్ వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెరిశాడు. వీరితో పాటు రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, జబర్దస్త్ శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా అందించిన మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ గవర్నర్ తో హనుమాన్ చిత్ర బృందం..

25 సెంటర్లలో 100 రోజులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి