- Telugu News Photo Gallery Cinema photos Amitabh Bachchan Starts KBC 16 Shoot Says Worked With No Break, Ate Lunch In Car
Amitabh Bachchan: 81 ఏళ్ల వయసులోనూ నాన్ స్టాప్ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే భోజనం తింటూ..
ప్రముఖ హిందీ టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను లక్షాధికారులు, కోటీశ్వరులను చేసే ఈ టీవీ షోకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
Updated on: Apr 24, 2024 | 11:17 PM

ప్రముఖ హిందీ టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను లక్షాధికారులు, కోటీశ్వరులను చేసే ఈ టీవీ షోకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

కేవలం అమితాబ్ బచ్చన్ కోసమే ఈ షో చూసేవారి సంఖ్య భారీగా ఉంది. వీక్షకులకు సాధారణ జ్ఞానంతో పాటు కొంత వినోదం కూడా కేబీసీ షో ద్వారా లభిస్తుంది.

ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 16వ సీజన్ మొదలవుతోంది. అమితాబ్ బచ్చన్ ఈ షోకి హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. విశేషమేమిటంటే.. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

'ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. కారులో భోజనం చేశాను. అయితే CSK వర్సెస్ LSG మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇంటికి చేరుకున్నాను' అని అమితాబ్ తెలిపారు.

సెట్స్‌లో మొదటి రోజు ఎలా ఉందో అమితాబ్ బచ్చన్ వివరించారు. 'పని ఒత్తిడి కారణంగా లంచ్ బ్రేక్ సరిగా తీసుకోలేకపోతున్నాను. ఈ కారణంగానే కారులో కూర్చుని భోజనం చేశాను' అని బిగ్ బీ చెప్పుకొచ్చారు.