- Telugu News Photo Gallery Cinema photos Can You Remember This Actress She Is Shreya Dhanwanthary Old Photo Goes Viral
Tollywood: పదహారాణాల తెలుగమ్మాయి ఈ వయ్యారి.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
పదహారాణాల తెలుగమ్మాయి ఈ వయ్యారి.. తెలుగు సినిమాల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. శ్రేయ ధన్వంతరీ. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో కాలేజీలో చైతూ స్నేహితురాలిగా కనిపించింది.
Updated on: Apr 25, 2024 | 2:03 PM

పదహారాణాల తెలుగమ్మాయి ఈ వయ్యారి.. తెలుగు సినిమాల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. శ్రేయ ధన్వంతరీ.

ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో కాలేజీలో చైతూ స్నేహితురాలిగా కనిపించింది. ఈ మూవీలో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఆ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ జోడిగా స్నేహగీతం సినిమాలో నటించింది. అయితే ఆమె నటించిన సినిమాలు అంతగా కలిసిరాలేదు. దీంతో తెలుగులో అంతగా అవకాశాలు కూడా కలిసి రాలేదు. ఆ తర్వాత టీవీలో పలు యాడ్స్ చేసింది.

సినిమాలతోపాటు పలు వెబ్ సిరీస్ చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్, ఏ వైరల్ వెడ్డింగ్, స్కామ్ 1992 సిరీస్ లో బాగా పాపులర్ అయ్యింది. అలాగే ఫేడ్ టూ వైట్ అనే బుక్ రాసింది. 2020లో మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో 43వ స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తుంది శ్రేయ. తాజాగా ఆమె పాత ఫోటోస్ వైరలవుతున్నాయి.




