IPL 2024: ‘గెలవడం రాదు కానీ.. కాస్త సిగ్గుండాలే’.. ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమరూన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు గాను ఏడింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం RCB పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్‌లకు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

IPL 2024: 'గెలవడం రాదు కానీ.. కాస్త సిగ్గుండాలే'.. ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
RCB Players
Follow us
Basha Shek

|

Updated on: Apr 24, 2024 | 8:56 PM

ఒకవైపు ఐపీఎల్ 2024లో రాజస్థాన్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మరోవైపు మిగతా జట్లకంటే అశేషమైన అభిమానులను సంపాదించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఈ సీజన్‌లో చాలా పేలవ ప్రదర్శన చేస్తోంది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమరూన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు గాను ఏడింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం RCB పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్‌లకు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, మరికొందరు ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన పని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. RCB తన తదుపరి మ్యాచ్‌ని గురువారం ( ఏప్రిల్ 25న) హైదరాబాద్‌తో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకుంది బెంగళూరు టీమ్. కాగా విరాట్ కోహ్లీ One8 Commune పేరుతో రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ లో కూడా దీనికి బ్రాంచ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లను తన రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు కోహ్లీ.. అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, సుయాష్ ప్రభుదేశాయ్, విశాక్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వన్ 8 కమ్యూన్‌లో పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

అయితే దీనిపై ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్లందరినీ అభిమానులు ట్రోల్ చేశారు. RCB ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ -1.046 మాత్రమే. అంటే ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే RCB ఆశలు ముగిశాయి. ఈ సీజన్ లో బెంగళూరు బౌలర్లు చాలా పేలవంగా రాణిస్తున్నారు. జట్టులోని బౌలర్లు ఎవరూ తమను తాము నిరూపించుకోలేకపోవడమే RCB ఓటమికి ప్రధాన కారణం. ఈ సీజన్‌లో ఆర్‌సిబికి ఉన్న ఏకైక మంచి విషయం ఏమిటంటే, వారి టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించడం. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ లో ఒక సెంచరీ కూడా సాధించాడు. అయితే, విరాట్ అద్భుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ RCB కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో ఆర్సీబీ ఆటగాళ్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..