AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs GT, IPL 2024: పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు

Delhi Capitals vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ రిషభ్ పంత్ ( 43 బంతుల్లో 88 నాటౌట్, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. అంతకు ముందు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ( 43 బంతుల్లో 66, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడాడు.

DC vs GT, IPL 2024: పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
Delhi Capitals
Basha Shek
|

Updated on: Apr 24, 2024 | 9:37 PM

Share

Delhi Capitals vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ రిషభ్ పంత్ ( 43 బంతుల్లో 88 నాటౌట్, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. అంతకు ముందు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ( 43 బంతుల్లో 66, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడాడు. ఇక ఆఖరులో ట్రిస్టన్ స్టబ్స్ ( 7 బంతుల్లో 26, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఒకానొకదశలో ఢిల్లీ 44 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ పంత్, అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడారు. మొదట్లో నెమ్మదిగా ఆడిన వీరు క్రమంగా జోరు పెంచారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. పంత్, స్టబ్స్ ధాటికి ఆఖరి రెండు ఓవర్లలో ఢిల్లీ 53 పరుగులు రాబట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సందీప్‌ వారియర్ 3, నూర్ అహ్మద్‌ ఒక వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

శరత్ BR, సాయి సుదర్శన్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్:

పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలాం, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?