- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Wife Namrata Shirodkar Selfie With Sunrisers Hyderabad Captain Pat Cummins
Namrata Shirodkar: ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ రాక్ ఆన్’.. కెప్టెన్ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠీ తదితరులు మహేశ్ ను కలిశారు.
Updated on: Apr 23, 2024 | 10:22 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠీ తదితరులు మహేశ్ ను కలిశారు.

మహేశ్, ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్లు కలిసిన దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. వీటిని చూసి అటు మహేశ్ అభిమానులు, ఇటు క్రికెట్ అభిమానులు తెగ మురిసిపోయారు.

అయితే ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. తాజాగా కమిన్స్ తో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందామె.

'మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాక్ ఆన్' అంటూ నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ఎస్ ఆర్ హెచ్ తర్వాతి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడనుంది.