- Telugu News Photo Gallery Cinema photos Alia Bhatt To Nora Fatehi, This Bollywood Actress Does Not Have The Right To Vote
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా భట్ కూడా.. కారణమిదే
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు వివిధ దశల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ సహా స్టార్లు తమిళనాడులో జరిగిన మొదటి దశ పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Updated on: Apr 23, 2024 | 10:43 PM

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు వివిధ దశల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ సహా స్టార్లు తమిళనాడులో జరిగిన మొదటి దశ పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే కొంతమంది బాలీవుడ్ నటీమణులకు మన దేశంలో ఓటు హక్కు లేదు. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ కూడా ఉండడం గమనార్హం.

నోరా ఫతేహి కెనడాలో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మొరాకోకు చెందినవారు. అందుకే ఆమెకు కెనడియన్ పౌరసత్వం ఉంది. ఈ కారణంగా నోరాకు భారత దేశ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కు మన దేశంలో ఓటు హక్కు లేదు. ఎందుకంటే ఆమెకు భారత పౌరసత్వం లేదు. అలియా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జన్మించింది. ఆమె తల్లి కూడా ఈ నగరంలోనే పుట్టింది.

ఇక పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ బ్రిటిష్ హాంకాంగ్‌లో జన్మించినందున ఆమెకు భారత పౌరసత్వం లేదు. అందుకే భారతదేశంలో క్యాట్ కు కూడా ఓటు హక్కు లేదు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 1985 11 ఆగస్టు బహ్రెయిన్‌లోని మనామాలో జన్మించింది. ఆమె తండ్రిది శ్రీలంక అయితే తల్లిది మలేషియా అందుకే జాక్వెలిన్ కు శ్రీలంక పౌరసత్వం ఉంది. కాబట్టి భారత దేశ ఎన్నికల్ ఆమెకు లో ఓటు వేసే హక్కు లేదు.