T20 World Cup 2024: ‘వందే మాతరం’.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!

ఐపీఎల్ ముగియగానే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది తొలిసారిగా 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో సంయుక్తంగా ఈ మెగా క్రికెట్ టోర్నీ జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరగనున్నాయి

T20 World Cup 2024: 'వందే మాతరం'.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
T20 World Cup 2024
Follow us

|

Updated on: Apr 23, 2024 | 7:25 PM

ఐపీఎల్ ముగియగానే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది తొలిసారిగా 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో సంయుక్తంగా ఈ మెగా క్రికెట్ టోర్నీ జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీకి జట్లను ప్రకటించేందుకు మే 1 చివరి రోజు. ఏప్రిల్ 30 లేదా మే 1న భారత జట్టును ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఐపీఎల్ మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నా క్రికెట్ అభిమానుల్లో చాలా మంది దృష్టి టీ 20 ప్రపంచకప్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ నకు టీమిండియా సిద్ధమంటూ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఒక ఆసక్తికర ప్రోమోను షేర్ చేసింది. ‘రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?’ అనే క్యాప్షన్‌తో సామాజిక మాధ్యమాల వేదిక‌గా ఈ వీడియోను పంచుకుంది.

ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో భారత జాతీయ గేయం ‘వందేమాత‌రం’ను ప్లే చేయ‌డం విశేషం. ఈ వీడియోలో భార‌త జ‌ట్టు స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజాల‌ను చూపించారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఆఖరిలో కోహ్లీ సెల్యూట్‌ చేయడం అభిమానులకు ఫుల్ గూస్ బంప్స్ తెప్పించింది. గత 11 ఏళ్లుగా టీమిండియా ప్రపంచకప్ గెల్చుకోలేదు. చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని 2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమ్ ఇండియా గెలుచుకుంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఏడాదైనా భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని భారత క్రీడాభిమానులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..