- Telugu News Photo Gallery Cinema photos SunRisers Hyderabad Players Meet Mahesh Babu, Photos Goes Viral
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్ లో ఫొటోస్.. ఎందుకు కలిశారో తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ మేనియా నడుస్తోంది. మ్యాచ్ లు కూడా ఉత్కంఠభరితంగా జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అన్నిటికీ మించి ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది.
Updated on: Apr 22, 2024 | 10:20 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ మేనియా నడుస్తోంది. మ్యాచ్ లు కూడా ఉత్కంఠభరితంగా జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అన్నిటికీ మించి ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిశారు. ఓ యాడ్ షూట్ కోసం వీరంతా మహేశ్ ను కలిసినట్లు తెలుస్తోంది.

సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, యాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి మహేశ్ బాబును కలిసిన వారిలో ఉన్నారు.

మహేశ్ బాబుతో మొదట గ్రూఫ్ ఫొటో దిగిన ఎస్ఆర్ హెచ్ ప్లేయర్లు.. ఆ తర్వాత సూపర్ స్టార్ తో ఒక్కొక్కరు విడిగా ఫొటోలు దిగారు.

ఇందులో లాంగ్ హెయిర్‌తో సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు మహేశ్. ప్రస్తుతం ఈ ఫొటోలను చూసి అటు మహేశ్ అభిమానులు, ఇటు క్రికెట్ అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ఎస్ ఆర్ హెచ్ తర్వాతి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడనుంది.