పుష్ప, తంగలాన్ సినిమాల కోవలోకే చేరనుంది కంగువ. ప్రపంచవ్యాప్తంగా డే ఒన్నే సత్తా చాటాలనే ధ్యేయంతో పనిచేస్తోంది యూనిట్. నెవర్ బిఫోర్ అవతార్‌లో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు సూర్య. జానపద యోధుడిని, మోడ్రన్ వీరుడిని ఎదురెదురుగా నిలబెట్టి రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. కంగువ వరల్డ్ ఎలా ఉండబోతోందోననే ఇంట్రస్ట్ జనాల్లోనూ మెండుగా కనిపిస్తోంది.