DC vs GT, IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్.. అరుదైన రికార్డు ఖాతాలోకి..

Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకంటూ ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు.

DC vs GT, IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్.. అరుదైన రికార్డు ఖాతాలోకి..
Shubman Gill
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:21 PM

Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకంటూ ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. అతని కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏమీ చేయలేకపోయింది, కానీ గిల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీతో మ్యాచ్ శుభ్‌మన్ గిల్ 100వ ఐపీఎల్ మ్యాచ్. తద్వారా ఈ ఘనత సాధించిన 65వ ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. కాబట్టి ఐపీఎల్‌లో గిల్‌కి ఢిల్లీతో మ్యాచ్ చాలా‌ ప్రత్యేకం. అందుకే ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో గుజరాత్‌ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. 4 మ్యాచ్‌లు గెలవగా, మరో 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

ఐపీఎల్ 2024లో శుభ్‌మన్ గిల్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 298 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ స్కోరు 89. ఐపీఎల్‌లో ఇప్పటివరకు గిల్ మొత్తం 99 మ్యాచ్‌లు ఆడాడు. 3088 పరుగులు చేశాడు. గిల్ అత్యుత్తమ IPL స్కోరు 129. ఐపీఎల్‌లో మొత్తం 3 సెంచరీలు చేశాడు. అతని పేరు మీద 20 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

శరత్ BR, సాయి సుదర్శన్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్:

పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలాం, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్

గిల్ కెరీర్ లో వందో ఐపీఎల్ మ్యాచ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..