దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.! కమిన్స్ టీమ్‌మేట్ ఎంట్రీ..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. అయితేనేం మరో నెలన్నర రోజుల్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌పైనే అందరి కళ్లు. టీమిండియాకి ఏయే ప్లేయర్స్ ఎంపిక అవుతారు.? ఎవరికి ఉద్వాసన పలకనున్నారు.? అనేది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.

దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.! కమిన్స్ టీమ్‌మేట్ ఎంట్రీ..
Rcb Vs Srh
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:16 PM

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. అయితేనేం మరో నెలన్నర రోజుల్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌పైనే అందరి కళ్లు. టీమిండియాకి ఏయే ప్లేయర్స్ ఎంపిక అవుతారు.? ఎవరికి ఉద్వాసన పలకనున్నారు.? అనేది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. టీ20 వరల్డ్‌‌కప్‌ గెలుపే లక్ష్యంగా బీసీసీఐ పావులు కదుపుతోంది. ఇప్పటికే 10 మందికిపైగా ప్లేయర్ల ఎంపిక జరిగినట్టు.. మరో 10 మంది కోసం ఎంపికలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ తరుణంలో ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. చెత్త ఫామ్‌ కొనసాగిస్తున్న హార్ధిక్‌ పాండ్యాకు బదులు.. టీమిండియాలోకి ఓ తెలుగోడిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అతడు మరెవరో కాదు నితీష్ రెడ్డి. ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌కు దొరికిన ఈ ఆణిముత్యం. క్వాలిటీ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం అద్భుత ఫాంలో ఉన్న నితీష్ రెడ్డిపై టీమిండియా సెలెక్టర్లు కన్ను పడ్డట్టు సమాచారం. హార్దిక్ పాండ్యాకు రీప్లేస్‌మెంట్‌గా నితీష్ రెడ్డిని తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు సారధ్యం వహిస్తోన్న హార్దిక్ పాండ్యా.. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే ఎప్పుడు గాయపడతాడో కూడా తెలియని పరిస్థితి. అందుకే శివమ్ దూబేతో పాటు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జట్టులోకి నితీష్‌ రెడ్డిని కూడా తీసుకోవాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారట. అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సన్‌రైజర్స్ టీంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయడంతో పాటు మిడిలార్డర్‌లో యాంకర్ రోల్ పోషిస్తున్నాడు నితీష్ రెడ్డి. దీంతో పాండ్యా ప్లేస్‌కి నితీష్ కరెక్ట్ ఆప్షన్ అని క్రికెట్‌ నిపుణులు అంచనా. కానీ కొందరైతే నితీష్ రెడ్డిని ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ప్రయత్నించాలని సూచిస్తున్నారు.