T20 World Cup 2024: ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటోన్న రైనా

ఈ ఐపీఎల్‌లో చాలా మంది యంగ్ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అందులోనూ భారత జట్టు ఆటగాళ్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నారు. ఈ లిస్టులో మయాంక్ యాదవ్, అశుతోష్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ సహా పలువురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇందులో

T20 World Cup 2024: ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటోన్న రైనా
Team India
Follow us
Basha Shek

|

Updated on: Apr 24, 2024 | 7:54 PM

ఈ ఐపీఎల్‌లో చాలా మంది యంగ్ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అందులోనూ భారత జట్టు ఆటగాళ్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నారు. ఈ లిస్టులో మయాంక్ యాదవ్, అశుతోష్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ సహా పలువురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇందులో సీఎస్‌కే డ్యాషింగ్ బ్యాటర్ శివమ్ దూబే పేరు అగ్రస్థానంలో ఉంది. గత ఎడిషన్ నుండి CSK తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న దూబే జట్టు మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా మారాడు. ఎలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చినా దూకుడే దూబే ప్రధాన ఆయుధం. మ్యాచ్ దిశను మార్చగల సామర్థ్యం అతనికుంది. ఇది చాలా మ్యాచ్‌ల్లో చూశాం. అలాంటి అద్భుతమైన ఆటగాడు దూబేకి మద్దతుగా ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాళ్లు తమ గళం విప్పుతున్నారు.

వాస్తవానికి మరికొద్ది రోజుల్లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ కూడా భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కొంతమంది భారత యువ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శివమ్ దూబేకు అవకాశం ఇవ్వాలని భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా సెలక్షన్ బోర్డు చైర్మన్ అజిత్ అగార్కర్‌కు విజ్ఞప్తి చేశాడు. నిజానికి లక్నోతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో శివమ్ 27 బంతుల్లో 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 7 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. దీని తర్వాత, రైనా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘ శివమ్ దూబే కోసం ప్రపంచ కప్ లోడ్ అవుతోంది, అజిత్ అగార్కర్ భాయ్ దయచేసి అతన్ని T20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయండి’ అని రాసుకొచ్చాడు. రైనా ట్వీట్‌పై అభిమానులు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సురేశ్ రైనా ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..