Aadujeevitham OTT: బ్లాక్ బస్టర్ మూవీ ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన లేటెస్ట్ సర్వైవల్‌ థ్రిల్లర్‌ సినిమా 'ఆడు జీవితం' (ది గోట్‌లైఫ్‌). సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ ఇతి వృత్తంతో జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది

Aadujeevitham OTT: బ్లాక్ బస్టర్ మూవీ ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Aadujeevitham Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 24, 2024 | 9:57 PM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన లేటెస్ట్ సర్వైవల్‌ థ్రిల్లర్‌ సినిమా ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్‌). సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ ఇతి వృత్తంతో జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మ‌ల‌యాళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఆడు జీవితం కూడా ఒకటి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ కష్టపడిన తీరు, నటన అందరినీ కంటతడి పెట్టించింది. స్ట్రాంగ్ కంటెంట్ ఉండడంతో తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం. మలయాళంలో మాదిరిగా ఆడకపోయినప్పటికీ తెలుగులో కూడా ఆడు జీవితం సినిమా మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ మలయాళంలో చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న ఆడు జీవితం మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పృథ్వీరాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 30 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం.

కాగా ముందస్తు ఒప్పందం ప్రకారం థియేటర్లలో సినిమా విడుదలైన సమయం నుంచి 40 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలచేయవచ్చు. దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం స్ట్రీమింగ్ కానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సంబంధిత ఓటీటీ సంస్థ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువరించనుందని సమాచారం. ఆడు జీవితం సినిమాలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేషం. ది గోట్‌డేస్ అనే న‌వ‌ల ఆధారంగా య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు బ్లెస్లీ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

ఇవి కూడా చదవండి