Bhimaa OTT: ఓటీటీలోకి వచ్చేసిన గోపిచంద్ భీమా.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
ఇందులో గోపిచంద్ భీమా, రామా అనే రెండు పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటి కలిగించిన ఈ మూవీ మార్చి 8న అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా కాలం సరైన హిట్టు కోసం వెయిట్ గోపిచంద్ కు ఈ మూవీ నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా. ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ భీమా, రామా అనే రెండు పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటి కలిగించిన ఈ మూవీ మార్చి 8న అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా కాలం సరైన హిట్టు కోసం వెయిట్ గోపిచంద్ కు ఈ మూవీ నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
భీమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గత అర్దరాత్రి (ఏప్రిల్ 25) నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. భీమా సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు గోపిచంద్. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన సినిమా స్ట్రీమింగ్ అవుతుందని.. చూడండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ సినిమా థియేటర్లలో దాదాపు రూ. 20కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్స్ రాట్టింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను ఎస్ఐ భీమా కట్టడి చేస్తాడు. పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది. మళ్లీ దానిని భీమా తెరిచాడా అనేది ఈ సినిమా. ప్రస్తుతం గోపిచంద్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు.
Bhimaa is locked and loaded! Are you?
Watch the Trailer Now – https://t.co/CITN3AuxKQ#BhimaaonHotstar Streaming from Midnight!@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/EZ9LGFxCMC
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.