AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migration: ఎండల్లో పిల్లలను బయటకు వెళ్లకుండా చేస్తోన్న యానిమేషన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడవుతుందో తెలుసా ..?

"యూ లుక్ ఏ మ్యాడ్.. యూ నీడ్ ఏ హాగ్" అంటూ రెండు బాతులకు సంబంధించిన రీల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ సినిమా పేరు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అదే మైగ్రేషన్. ఈ చిత్రంలో, ఒక బాతు కుటుంబం తమ ఇంటి నుండి మరొక ప్రదేశానికి వలస వెళుతుంది. ఈ సినిమా టైటిల్ కూడా అదే. అలా బాతు కుటుంబం వెళ్లే దారిలో వాటికి ఎదురయ్యే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, కష్టాలను చూపిస్తూ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.

Migration: ఎండల్లో పిల్లలను బయటకు వెళ్లకుండా చేస్తోన్న యానిమేషన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడవుతుందో తెలుసా ..?
Migration
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2024 | 12:00 PM

Share

ప్రస్తుతం వేసవి సెలవులు వచ్చేసాయి. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో మీ పిల్లలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వకుండా వారికి సరికొత్త వినోదాన్ని అందించాలంటే వారికి ‘మై గ్రేషన్’ సినిమా చూపించాల్సిందే. వేసవి సెలవులలో ఇంట్లో పిల్లలు ఉత్సాహంగా చూడగలిగే గొప్ప సినిమా ఇది. కొద్ది రోజులుగా ఇన్ స్టాలో ఓ రీల్ తెగ ట్రెండ్ అవుతుంది. “యూ లుక్ ఏ మ్యాడ్.. యూ నీడ్ ఏ హాగ్” అంటూ రెండు బాతులకు సంబంధించిన రీల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ సినిమా పేరు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అదే మైగ్రేషన్. ఈ చిత్రంలో, ఒక బాతు కుటుంబం తమ ఇంటి నుండి మరొక ప్రదేశానికి వలస వెళుతుంది. ఈ సినిమా టైటిల్ కూడా అదే. అలా బాతు కుటుంబం వెళ్లే దారిలో వాటికి ఎదురయ్యే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, కష్టాలను చూపిస్తూ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. చివరికి ఆ బాతు కుటుంబం సురక్షితంగా చేరిందనేది చిత్ర కథాంశం.

ఈ సినిమాలో రెండు బాతు పిల్లల చేష్టలు.. వాటి అల్లరి పనులను చూసి పిల్లలే కాదు.. పెద్దలు కూడా పడి పడి నవ్వుకునేలా సన్నివేశాలను రూపొందించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న అమెరికా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి బెంజమిన్ రెన్నర్ దర్శకత్వం వహించారు. డెస్పికబుల్ మీ, ది సూపర్ మారియో బ్రదర్స్ వంటి చిత్రాలకు బాధ్యత వహించిన యూనివర్సల్ పిక్చర్స్ అండ్ ఇల్యూమినేషన్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5తోపాటు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ చిన్నారులకు ఈ ఫన్నీ యానిమేషన్ చిత్రాన్ని ఇంట్లోనే చూపించండి ఇక.

ఈ సినిమాతోపాటు.. ఈ వేసవిలో మీ చిన్నారుల కోసం ఓటీటీలో మరిన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

ఇన్‌సైడ్ అవుట్.. ది బాస్ బేబీ.. డెస్పికబుల్ మి.. అప్.. ది లయన్ కింగ్.. ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్.. కోకో.. మోనా.. మినియన్స్. సిండ్రెల్లా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..