AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. ఎక్కడ చూడొచ్చంటే..

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. దీంతో అటు ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. కానీ విజయ్, మృణాల్ జోడి.. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. ఎక్కడ చూడొచ్చంటే..
Family Star
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2024 | 6:57 AM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఖుషి సూపర్ హిట్ తర్వాత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. విజయ్ కెరీర్ లో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలం తర్వాత విజయ్ మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా డీసెంట్ లుక్ లో కనిపించి అలరించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. దీంతో అటు ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. కానీ విజయ్, మృణాల్ జోడి.. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ సినిమా మే 3 నుంచి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే చూసేయ్యోచ్చు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన శ్రీలీల నటించనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ మూవీ కోసం ప్రేమలు సూపర్ హిట్ హీరోయిన్ మమితా బైజును చిత్రయూనిట్ సంప్రదించిందని.. అందుకు మలయాళీ కుట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?