AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tillu Square OTT: ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ..?

ఇన్నాళ్లు యూత్ క్రష్ గా ఉన్న ఈ కేరళ కుట్టి లిల్లీ పాత్రతో కుర్రాళ్ల మనసులకు గాయం చేసింది. కానీ టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటన చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అలాగే నేహా శెట్టి, ప్రియాంక జవాల్కర్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. మొత్తానికి డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ అందించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బ్లా్క్ బస్టర్ హిట్ అందుకుంది.

Tillu Square OTT: ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ..?
Tillu Square
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2024 | 7:48 AM

Share

మొన్నటివరకు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా టిల్లు స్క్వేర్. ఎప్పటిలాగే తనదైన పంచులు, డైలాగ్ డెలివరీతో అలరించాడు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‏గా వచ్చిన ఈ సినిమా అడియన్స్‏ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఇన్నాళ్లు యూత్ క్రష్ గా ఉన్న ఈ కేరళ కుట్టి లిల్లీ పాత్రతో కుర్రాళ్ల మనసులకు గాయం చేసింది. కానీ టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటన చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అలాగే నేహా శెట్టి, ప్రియాంక జవాల్కర్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. మొత్తానికి డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ అందించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బ్లా్క్ బస్టర్ హిట్ అందుకుంది.

అటు యూఎస్ మార్కెట్ లోనూ స్టార్ హీరో రేంజ్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు మూవీ లవర్స్. ఇక ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. టిల్లు స్క్వేర్ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ క్రేజీ రైడ్ మూవీ పాన్ ఇండియా భాషల్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ చిత్రానికి రామ్ మిర్యాల, భీమ్స్ సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. టిల్లు స్క్వేర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. టిల్లు క్యూబ్ త్వరలోనే ప్రకటించనున్నామని తెలిపారు మేకర్స్. అలాగే ఇందులో నటీనటుల వివరాలను కూడా వెల్లడించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..