Monkey Man OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ హిట్ మూవీ.. మంకీ మ్యాన్ ఎక్కడ చూడొచ్చంటే?

'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేవ్ పటేల్. ఆ తర్వాత హాలీవుడ్‌లోనే ఎక్కుఎగా సినిమాలు చేస్తున్నాడు. ఈ కోవలో ఇటీవల మంకీ మ్యాన్ సినిమాతో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో తనే హీరోగానూ నటించడం విశేషం.  అలాగే తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా ఇందులో నటించింది.

Monkey Man OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ హిట్ మూవీ.. మంకీ మ్యాన్ ఎక్కడ చూడొచ్చంటే?
Monkey Man Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 24, 2024 | 5:29 PM

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేవ్ పటేల్. ఆ తర్వాత హాలీవుడ్‌లోనే ఎక్కుఎగా సినిమాలు చేస్తున్నాడు. ఈ కోవలో ఇటీవల మంకీ మ్యాన్ సినిమాతో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో తనే హీరోగానూ నటించడం విశేషం.  అలాగే తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా ఇందులో నటించింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన మంకీ మ్యాన్ ఏప్రిల్ 5న అమెరికాతో పలు దేశాల్లో విడుదలైంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఇండియాలో మాత్రం రిలీజ్ కాలేదు. అయితే విడుదలైన చోటల్లా ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చూసే వారికి మంకీ మ్యాన్ బాగా నచ్చుతుంది. దీంతో ఇక్కడి జనాలు కూడా ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలోనే ఈ సూపర్ హిట్ సినిమా సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో‌, ఆపిల్ టీవీ ఓటీటీల్లో మంకీ మ్యాన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఓ తిరకాసు ఉంది. అదేంటంటే..ప్రస్తుతానికి మంకీ మ్యాన్ సినిమా కేవలం రెంటల్ బేసిస్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే కేవలం ఇంగ్లిష్ భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే త్వరలోనే మంకీ మ్యాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఉచితంగా చూసే అవకాశం దక్కనుంది. అయితే భారతీయ భాషల్లో ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. ‘మంకీ మ్యాన్’ కథ విషయానికొస్తే.. యాతనా అనే సిటీలో ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద‍్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరంటూ ఉండదు. ఇతను.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారితో తలపడతాడు. మరి హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మంకీ మ్యాన్ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి