Family Star OTT: 20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
ఫ్యామిలీ స్టార్ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహించారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో గీతగోవిందం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా హిట్ దేవరకొండ ఫ్యాన్స్ కు అది సరిపోలేదు. ఫ్యామిలీ స్టార్ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహించారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో గీతగోవిందం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో యావరేజ్ గా నిలిచినఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఫ్యామిలీ స్టార్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందనితెలుస్తోంది. ఈ నెల 26న ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీలోకి రానుంది.
కేవలం 20 రోజులకే ఫ్యామిలీ మ్యాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. మొన్నామధ్య వచ్చిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. కలెక్షన్స్ ఓ మాదిరిగా రాబట్టింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తున్నాడు.