ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న కొంతమంది మీడియా ముందుకు వచ్చి మరీ తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. నటి కస్తూరి ఇప్పటికే షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అలాగే సింగర్ చిన్మయి కూడా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి తెలిపింది. దాని పై పోరాటం కూడా చేస్తుంది. అలాగే బుల్లితెర నటులు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేశారు.

ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2024 | 7:04 PM

కాస్టింగ్ కౌచ్ అనే పదం సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తూనే ఉంది. అన్ని ఇండస్ట్రీలోనూ ఇది ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీ అనేసరికి అది పెద్ద చర్చ గా మారుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ స్పందించారు. కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న కొంతమంది మీడియా ముందుకు వచ్చి మరీ తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. నటి కస్తూరి ఇప్పటికే షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అలాగే సింగర్ చిన్మయి కూడా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి తెలిపింది. దాని పై పోరాటం కూడా చేస్తుంది. అలాగే బుల్లితెర నటులు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేశారు. తాజాగా ఓ నటి కూడా కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ గా హీరోయిన్స్ తోనే మాట్లాడుతారు. ఆఫర్స్ కావాలంటే అడ్జెస్ట్ అవ్వాలని అడుగుతుంటారు. వాళ్లకు ఓకే చెప్తేనే సినిమాల్లో ఛాన్స్ కు వస్తాయి అని తెలిపింది. ఆ నటి ఎవరో కాదు కోలీవుడ్ హీరోయిన్ గాయత్రీ రేమా. ఈ అమ్మడు కోలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోనూ నటించింది ఈ చిన్నది. ప్రణవం అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

అడ్జస్ట్ మెంట్‌కు నో చెప్పడం వల్లే తనకు సినిమా అవకాశాలు రావడం లేదు అని తెలిపింది. ఈ క్రమంలోనే ఓ దర్శకుడు తనను కమిట్ మెంట్ అడిగారు అని తెలిపింది. నటించమని అడిగితే పర్వాలేదు కానీ.. పడుకోమని అడిగితే ఎలా అంటూ.. అసహనం వ్యక్తం చేసింది గాయత్రీ రేమా.. ఇదిలా ఉంటే తనకు హీరో సిద్దార్థ్ అంటే చాలా ఇష్టమని ఆయనతో నటించే అవకాశం వస్తే బెడ్ షేరింగ్ కు కూడా సిద్ధం అని తెలిపి షాక్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Gayatri Rema (@gayatrirema)

గాయత్రీ ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by KUBER (@ikuber_mahendran)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.