Team India: ఇంకెంత కాలం ఆడతారు.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ చేయాల్సిందే: టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..

Rohit Sharma and Virat Kohli Retirement: ఈ సంవత్సరం, T20 ప్రపంచ కప్ USA, వెస్టిండీస్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత అభిమానుల కళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనపై స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు టీమిండియాక కీలకం కానున్నారు. భారత జట్టు కూడా వీళ్లపై ప్రత్యే శ్రద్ధ చూపిస్తుంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌లో ఈ జోడీ చాలా కాలం తర్వాత అతి తక్కువ ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ఆడటం కనిపించింది.

Team India: ఇంకెంత కాలం ఆడతారు.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ చేయాల్సిందే: టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
Rohit Sharma Virat Kohli
Follow us

|

Updated on: Apr 28, 2024 | 7:30 AM

Rohit Sharma and Virat Kohli Retirement: ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ (IPL 2024) 2024 జరుగుతోంది. ఆ తర్వాత T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ప్రారంభమవుతుంది. ఈ పొట్టి ఫార్మాట్ జూన్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రాక్టీస్ ప్రారంభించాయి. త్వరలో భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే T20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా ICC తో ప్రత్యేకంగా మాట్లాడాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ అత్యుత్తమ ఆటగాళ్లు ఇద్దరూ తమ మనస్సాక్షికి అనుగుణంగా ముందుకు సాగాలని, వారి వయస్సు పెరుగుతున్న క్రమంలో రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించాడు.

ఈ సంవత్సరం, T20 ప్రపంచ కప్ USA, వెస్టిండీస్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత అభిమానుల కళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనపై స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు టీమిండియాక కీలకం కానున్నారు. భారత జట్టు కూడా వీళ్లపై ప్రత్యే శ్రద్ధ చూపిస్తుంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌లో ఈ జోడీ చాలా కాలం తర్వాత అతి తక్కువ ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ఆడటం కనిపించింది.

యూవీ ICCతో మాట్లాడుతూ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి వారి కోరిక మేరకు టెస్ట్, ODI క్రికెట్ ఆడొచ్చు. అయితే 2024 T20 ప్రపంచ కప్ తర్వాత, ఈ ఇద్దరు ఆటగాళ్లు T20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాలి’ అంటూ సూచించాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్, విరాట్‌లు రిటైర్మెంట్‌కు చేయాలి – యువరాజ్ సింగ్..

యువరాజ్ మాట్లాడుతూ, “ఈ ఇద్దరు ఆటగాళ్ల వయసు పెరుగుతున్న క్రమంలో ప్రజలు వీళ్ల గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. జనాలు వీళ్ల ఫామ్‌ను మరచిపోతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారతదేశానికి గొప్ప ఆటగాళ్ళు. వాళ్లు కోరుకున్నప్పుడు రిటైర్ కావడానికి అర్హులు” అంటూ తెలిపాడు.

“నేను T20 ఫార్మాట్‌లో ఎక్కువ మంది యువ ఆటగాళ్లను చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు 50 ఓవర్లు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందకు అనుకూలంగా ఉంటారు. పొట్టి ఫార్మాట్‌లో పరుగులు చేయాలంటే కష్టపడాల్సి ఉంటుంది. దీంతో వాళ్లపై భారం పెరుగుతుంది. ఈ T20 ప్రపంచ కప్ తర్వాత, నేను జట్టులో చాలా మంది యువకులను చూడాలనుకుంటున్నాను. తదుపరి ప్రపంచ కప్ కోసం T20 జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం IPL 2024లో ఆడుతూ బిజీగా ఉన్నారు. ప్రస్తుత సీజన్‌లో వీరిద్దరూ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. కానీ పవర్‌ప్లే తర్వాత వారి స్ట్రైక్ రేట్ ప్రశ్నార్థకంగా మారింది. మరి ప్రపంచకప్‌లో వీరిద్దరి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..