AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs RR, IPL 2024: ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువగా..

Lucknow Super Giants vs Rajasthan Royals: ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. సంజూ శాంసన్ సారథ్యంలోని ఆ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా శనివారం (ఏప్రిల్ 27) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది

LSG vs RR, IPL 2024: ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువగా..
Rajasthan Royals
Basha Shek
|

Updated on: Apr 27, 2024 | 11:27 PM

Share

Lucknow Super Giants vs Rajasthan Royals: ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. సంజూ శాంసన్ సారథ్యంలోని ఆ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా శనివారం (ఏప్రిల్ 27) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (76), దీపక్‌ హూడా (50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ను అందుకుంది. సంజు శాంసన్‌ ( 33 బంతుల్లో 71 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి వరకు క్రీజులో ఉండి రాజస్థాన్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. అతనికి ధ్రువ్‌ జురెల్ ( 34 బంతుల్లో 52 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సహాకారం అందించారు. అంతకు ముందు ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (34), యశస్వి జైస్వా‌ల్‌ (24) రాజస్థాన్ కు శుభారంభం అందించారు. లక్నో బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ 1, మార్కస్‌ స్టాయినిస్‌ 1, అమిత్‌ మిశ్రా 1 వికెట్ తీశారు.

సంజూ శాంసన్ విన్నింగ్ షాట్..

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రియాన్ పరాగ్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అమిత్ మిశ్రా, అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్ చరక్, మణిమారన్ సిద్ధార్థ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..