T20 World Cup 2024: కోహ్లీ, హార్దిక్‌లకు నో ప్లేస్.. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలో ఎవరూ ఊహించని ఆటగాళ్లు
ఐపీఎల్-2024 పూర్తి కాగానే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్2024 ప్రారంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్ దేశాల వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ టోర్నీలో భారత్ ప్రయాణం ఆరంభించనుంది
ఐపీఎల్-2024 పూర్తి కాగానే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్2024 ప్రారంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్ దేశాల వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ టోర్నీలో భారత్ ప్రయాణం ఆరంభించనుంది. ఇందుకోసం త్వరలోనే భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు.. ప్రపంచ కప్ లో తలపడు భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా టీమిండియా ఎంపికపై సంచలన ప్రకటనతో ముందుకు వచ్చాడు. అదేంటంటే.. తన జట్టులో టీమిండియా రన్ మెషిన్, ఐపీఎల్ లో పరుగుల వర్షం కురిపిస్తోన్న విరాట్ కోహ్లీకి చోటివ్వ లేదు మంజ్రేకర్. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యాకు కూడా స్థానం కల్పించలేదు. హార్దిక్ కు బదులు అతని సోదరుడు కృనాల్ పాండ్యాను తెరమీదకు తీసుకొచ్చాడు సంజయ్. అలాగే ఐపీఎల్ సెన్సేషన్ శివం దూబేలకు కూడా తన జట్టులో చోటు దక్కలేదు. అయితే లక్నో యువ సంచలనం.. స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ కు ప్రపంచ కప్ లో చోటు కల్పించాడు మంజ్రేకర్.
కృనాల్ కు ఛాన్స్ ..
ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ తన వద్దనే ఉంది. ఇక ధనాధన్ లీగ్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు శివం దూబే. అయితే వీరిద్దరికి చోటివ్వకుండా సంచలన ప్రకటన చేశాడు సంజయ్. ఇక ఆయన చెబుతోన్న కృనాల్ పాండ్యా ఐపీఎల్ లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లో కేవలం 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు.
టీ20 ప్రపంచకప్-2024 కోసం సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.
Sanjay Manjrekar picks India’s squad for the 2024 T20 World Cup. (Star Sports). pic.twitter.com/31cUdgZ2Cg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.