AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో పెను తుఫాన్ సృష్టించాడు.. ఎవరంటే.?

ఒకవైపు ఐపీఎల్ 2024తో ప్రపంచమంతా ఉర్రూతలూగుతుంటే.. మరోవైపు 22 ఏళ్ల ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించాడు. యూరోపియన్ క్రికెట్‌లో ఫ్రాన్స్ బ్యాట్స్‌మెన్

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో పెను తుఫాన్ సృష్టించాడు.. ఎవరంటే.?
Cricket
Ravi Kiran
|

Updated on: Apr 26, 2024 | 9:25 PM

Share

ఒకవైపు ఐపీఎల్ 2024తో ప్రపంచమంతా ఉర్రూతలూగుతుంటే.. మరోవైపు 22 ఏళ్ల ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించాడు. యూరోపియన్ క్రికెట్‌లో ఫ్రాన్స్ బ్యాట్స్‌మెన్ పారిస్ జల్మీ తన తుఫాను హిట్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ పేరు సఫీ ఫైసల్.. పారిస్ జల్మీ తరపున ఆడుతున్నప్పుడు, అతడు కేవలం 27 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. సఫీ కేవలం 25 బంతుల్లో 14 సిక్సర్లు, 6 ఫోర్లతో సెంచరీ సాధించాడు. అంటే 27 బంతుల్లో 20 బౌండరీలు కొట్టాడు. కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే 98 పరుగులు చేశాడు. యూరోపియన్ క్రికెట్‌లోని ఈ మ్యాచ్‌లో సఫీ అద్భుతమైన బ్యాటింగ్‌తో పారిస్ జల్మీ 10 ఓవర్లలో 174 పరుగులు చేసింది.

యూరోపియన్ క్రికెట్ ఫ్రాన్స్‌లో సఫీ ఫైసల్ అత్యధిక పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 9 ఇన్నింగ్స్‌లలో 243 పరుగులు చేశాడు. సఫీ బ్యాట్ నుంచి 29 సిక్సర్లు రావడమే పెద్ద విషయం. అతడు 14 ఫోర్లు కొట్టాడు. సఫీ స్ట్రైక్ రేట్ 300 కంటే ఎక్కువ. అటు మరో మ్యాచ్‌లో డ్రైక్స్ ఆటగాడు మహ్మద్ నిసార్ కూడా తుఫాను సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 31 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిసార్ బ్యాట్ నుంచి 14 సిక్సర్లు, 5 ఫోర్లు వచ్చాయి. అంటే నిసార్, సఫీ కలిసి మొత్తం 28 సిక్సర్లు కొట్టారు. ఈ ఆటగాడు 350 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. నిసార్ సెంచరీ ఆధారంగా డ్రైక్స్ జట్టు 10 ఓవర్లలో 186 పరుగుల భారీ స్కోరు చేయగా, దానికి సమాధానంగా పారిస్ నైట్ రైడర్స్ జట్టు 10 ఓవర్లలో 87 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Follow Us
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్