IPL 2024: అట్లుంటది మనతోని! డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అంతే సరదాగా ఉంటాడు. తోటి ప్లేయర్లను సరదాగా ఆటపట్టించడం, గ్రౌండ్ లోనే డ్యాన్సులేయడం అతనికి కొత్తేమీ కాదు. గ్రౌండ్ లో ఏదైనా పాట ప్లే అయ్యిందంటే చాలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అంతే సరదాగా ఉంటాడు. తోటి ప్లేయర్లను సరదాగా ఆటపట్టించడం, గ్రౌండ్ లోనే డ్యాన్సులేయడం అతనికి కొత్తేమీ కాదు. గ్రౌండ్ లో ఏదైనా పాట ప్లే అయ్యిందంటే చాలు.. హుషారైన స్టెప్పులేస్తాడు. డ్యాన్స్ లు చేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. తాజాగా ఇలాంటి సందర్భమే మరోసారి వచ్చింది. గురువారం (ఏప్రిల్ 25) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ బ్యాటింగ్ సందర్భంగా విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియంలోని లౌడ్ స్పీకర్లలో సిద్దూ జొన్నలగడ్డ డీజే టిల్లు సాంగ్ ప్లే అయ్యింది. అంతే.. ఈ పాట వినగానే కోహ్లీలోని డ్యాన్సర్ బయటకు వచ్చాడు. సాంగ్ బీట్‌కు తగ్గట్టుగా అలా రెండు స్టెప్పులేశాడు. అంతే కాదు స్టేడియంలో ఈ సాంగ్ ప్లే అవుతున్నంత సేపు కోహ్లీ బాగా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో బాగా వైరలవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్‌కు సొంత మైదానంలో పరాభవం ఎదురైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ ఆర్ హెచ్ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్), రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్దసెంచరీలతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
డీజే టిల్లు పాటకు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో చూశారా?
Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.
– KING KOHLI IS A VIBE. ❤️🐐 pic.twitter.com/KkI3wTKdKp
— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024
Virat Kohli asking the crowd to cheer for the bowler. 👌❤️
– King boosting the morale of his teammates. 👏pic.twitter.com/7WWoYNVYPf
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.